మహేష్
బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం
అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న
సంగతి తెలిసిందే. గతంలో రాజమౌళి సైతం
ఈ విషయం ప్రస్తావించి మహేష్
నిర్ణయిం తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు మహేష్-రాజమౌళి కాంబినేషన్
లో చిత్రానికి రంగం సిద్దమైంది. దుర్గా
ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ,
ఎస్ గోపాల్ రెడ్డి ఈ సంచలన చిత్రం
గురించి ప్రకటన చేసారు. అలాగే ఆయన బోయపాటి
శ్రీను-రామ్ చరణ్ కాంబినేషన్
చిత్రం కూడా ప్రకటించి మెగా
అబిమానులను ఉత్తేజపరిచారు.
ఇక దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ
ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... మేము రెండు భారీ
చిత్రాలతో వస్తున్నాము. త్వరలోనే ఇవి సెట్స్ కు
వెళ్లనున్నాయి. అవి... మహేష్-రాజమౌళి కాంబినేషన్
చిత్రం, బోయపాటి శ్రీను-రామ్ చరణ్ చిత్రం.
ఇక వచ్చే సంవత్సరం ఎన్టీఆర్
తో కూడా సినిమా చేయనున్నాం.
వాటి వివరాలు తర్వాత ప్రకటిస్తాం అన్నారు.
ఇక దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై గతంలో క్షణ
క్షణం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, హలో బ్రదర్, సంతోషం,
వంటి చిత్రాలు వచ్చి సూపర్ హిట్స్
అయ్యాయి. ఎన్టీఆర్ తో రాఖీ చిత్రం
చేసిన తర్వాత వారు గ్యాప్ ఇచ్చారు.
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన
ఆ చిత్రం యావరేజ్ అయ్యింది. ఆ తర్వాత వారు
ఆరు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ భారీ
కాంబినేషన్ చిత్రాలు ప్రకటించారు.
ఈ రెండు కాంబినేషన్ చిత్రాలు
ట్రేడ్ లో ఒక్క సారిగా
సంచలనం రేపాయి. మహేష్.. రాజమౌళి కాంబినేషన్ అంటే చాలా హైప్
క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే రచ్చతో హిట్టులో
ఉన్న రామ్ చరణ్, దమ్ము
దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే కూడా ఓ
రేంజి సినిమా అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మహేష్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక రామ్ చరణ్.. హిందీ
జంజీర్, తెలుగులో వంశీ పైడిపల్లి చిత్రం
ఎవడు చిత్రాలతో బిజీగా ఉన్నారు.







0 comments:
Post a Comment