ఖమ్మం:
కొత్తగూడెం నియోజకవర్గంలో మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఇన్ఛార్జిగా
ఎంపికయినట్టు ఆ నియోజకవర్గ తెలుగుదేశం
పార్టీ నేత కోనేరు సత్యనారాయణ
బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బాలకృష్ణ సిఫార్సు మేరకే తనను తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
నియమించారని వచ్చిన వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు.
తాను
స్థానికంగా ఉండటం లేదని కొందరు
దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే తాను కొత్తగూడెంలో
పుట్టి పెరిగానని చెప్పారు. తనకు హైదరాబాద్లో
ఇల్లు లేదని, కార్యాలయం కూడా లేదని చెప్పారు.
తన కుటుంబానికి అనేకసార్లు అన్యాయం జరిగినా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై నమ్మకంతో పార్టీని అంటిపెట్టుకొని పని చేస్తున్నామని అన్నారు.
తమ కుటుంబానికి మొదటినుంచి నందమూరి కుటుంబంతో సాన్నిహిత్యం ఉందన్నారు.
మెజారిటీ
కార్యకర్తల అభిప్రాయాలకు వ్యతిరేకంగా బాలకృష్ణ ఏ రోజూ ఏ
సిఫార్సు చేయలేదన్నారు. రాష్ట్రంలో అవినీతిపరుల పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేయడం కోసం చంద్రబాబుతో
కలిసి పనిచేయడం కోసం బాలకృష్ణ ముందుకు
రావడం హర్షణీయమన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కలిసి కట్టుగా
వెళతామని చెప్పారు.
కాగా
ఖమ్మం జిల్లా కొత్తగూడెం పార్టీ ఇంచార్జీ విషయంలోనూ బాలకృష్ణ జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కోనేరు చిన్ని పేరును బాలకృష్ణ సూచించారని చెబుతున్నారు. ఇది తెలిసిన కొత్తగూడెం
నాయకులు అభ్యంతరపెట్టారని, స్థానికంగా ఉండే నాయకులను కాదని
హైదరాబాదులో ఉండేవారని నియమించడం సరి కాదని వారు
అన్నారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు దాన్ని
పెండింగులో పెట్టారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
0 comments:
Post a Comment