ఈ నెల 11న స్నేహ,ప్రసన్నల వివాహం ఘనంగా జరగటానికి చెన్నైలో
ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇక
వీరిద్దరిదీ ప్రేమ వివాహం అన్న
విషయం తెలిసిందే. ఈ నేఫధ్యంలో వారు
ప్రేమ కథ ఎలా మొదలైందో
ప్రసన్న వివరించారు. ఆయన మాటల్లోనే..మా
మధ్య ప్రేమ చిగురించడానికి కారణం
‘సెల్ఫోన్’.
సీయూజీ ప్లాన్ని ప్రవేశపెట్టిన సెల్ఫోన్ కంపెనీలకు ఈ
సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాన్స్టాప్గా
కొన్ని గంటల పాటు మేమిద్దరం
ఫోన్లో మాట్లాడుకున్న సందర్భాలు
ఉన్నాయి. నేను స్నేహను పెళ్లి
చేసుకోబోతున్నాననే విషయాన్ని మొదటిసారి విన్నప్పుడే చాలామంది శుభాకాంక్షలు చెప్పారు అని చెప్పారు.
ఇక స్నేహ మెడలో రెండుసార్లు
తాళి కట్టబోతున్న ప్రసన్న. ఇలా ఎందుకో వివరిస్తూ..మాది కులాంతర వివాహం.
అలాగని మా పెద్దల్ని నొప్పించడం
ఇష్టం లేదు. అందుకే మా
పద్ధతిలోనూ, స్నేహా వాళ్ల పద్ధతిలోనూ మా
పెళ్లి జరుగుతుంది. ఈ కారణంగా స్నేహ
మెడలో రెండుసార్లు తాళి కట్టబోతున్నాను అన్నారు
ప్రసన్న. ఈ నెల 11న
స్నేహతో ఆయన వివాహం చెన్నయ్లోని వనకరంలో గల
శ్రీవారు వెంకటాచలపతి పేలసలో పెళ్లి జరగనుంది. తమిళనాడులోనే ఇదే పెద్ద కళ్యాణ
మండపం. 10న చెన్నయ్లోనే
వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా
ఆహ్వాన పత్రికలను ఇస్తున్నారు. బాగా కావాల్సినవారికి స్వయంగా
వెళ్లి ఇస్తున్నారట స్నేహ, ప్రసన్న.
స్నేహ,
ప్రసన్నల పెళ్ళి శుభలేఖ చాలా వెరైటీగా ఉంది.
ఊదా రంగు పత్రికలో బంగారు
రంగు అక్షరాలతో సమాచారాన్ని ముద్రించారు. ఇన్విటేషన్ కవర్పైన ‘పి
అండ్ ఎస్’అంటే ప్రసన్న అండ్
స్నేహ అని ముద్రించారు. అలాగే
ఇటీవల మీడియావారికి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఓ సమావేశం ఏర్పాటు
చేశారు స్నేహ, ప్రసన్న. ఇద్దరూ ఒక్కో రిపోర్టర్ దగ్గరికి
వెళ్లి పత్రిక ఇచ్చి, తప్పనిసరిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ కాబోయే దంపతులు
స్వయంగా ఆహ్వాన పత్రికలివ్వడం మీడియావారికి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నారు.
ఇక తమ వివాహానంతర జీవితం
గురించి స్నేహ మాట్లాడుతూ...నా
అత్త, మామగారు ఎలా ఉండాలని కోరుకున్నానో
ప్రసన్న తల్లిదండ్రులు అలానే ఉన్నారు. పెళ్లయిన
వెంటనే మేమిద్దరం మాత్రమే ఉండటానికి ఓ ఇల్లు ఏర్పాటు
చేసుకున్నాం. ఆరు నెలలు పాటు
మా మ్యారీడ్ లైఫ్ని ఎంజాయ్
చేసి, అనంతరం ఉమ్మడి కుటుంబంలో ఉండాలనుకుంటున్నాం. పెళ్లి తర్వాత కెరీర్ని కొనసాగించాలా లేక
ఫుల్స్టాప్ పెట్టాలా? అనే విషయం గురించి
ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మా జీవితంలో వేయబోతున్న
కీలక అడుగు ఇది. మీ
అందరూ విచ్చేసి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటు న్నాను అని చెప్పారు.
0 comments:
Post a Comment