మద్యం
సేవించి వాహనం నడపటం అత్యంత
ప్రమాదకరం. ఈ విషయం గురించి
ఎంతో మంది నెత్తి నోరు
బాదుకుంటూ చెబుతున్నా ఈ చెవితో విని
ఆ చెవితో వదిలేసే వారే ఎక్కువ. అందుకే
రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే
ఉంది.
మద్యం
సేవించి డ్రైవ్ చేసే వారిలో అవగాహన
తీసుకువచ్చేందుకు మరియు అలాంటి వారిని
సురక్షితంగా వారి వారి స్వగృహాలకు
చేర్చేందుకు 'ఒకవేళ మీరు తాగినట్లయితే,
మేము డ్రైవ్ చేస్తాం' (ఇఫ్ యూ డ్రింక్
వుయ్ డ్రైవ్) అనే ఓ సరికొత్త
ప్రణాళికతో స్కొడా ఆటో ఇండియా ముందుకు
వచ్చింది.
ఇందులో
భాగంగా, మద్యం సేవించి కారు
నడపలేని స్థితిలో ఉన్న తమ కస్టమర్లను
స్కొడా ఇండియా క్షేమంగా వారి ఇంటికి చేర్చుతుంది.
ఇందుకు స్కొడా కస్టమర్లు చేయాల్సిందల్లా కంపెనీ ఇచ్చిన హెల్ప్లైన్ ఫోన్ నెంబర్లకు
ఫోన్ చేయటమే. ప్రస్తుతానికి ఈ ఆఫర్ కేవలం
ముంబై వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సర్వీస్
కేవలం స్కొడా కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.
తమ కంపెనీ సిద్ధాంతాల్లో సేఫ్టీ అత్యంత ముఖ్యమైనదని, ఇందులో భాగంగానే నిరతం రద్దీగా ఉండే
ముంబై రహదారులపై సురక్షితమైన డ్రైవింగ్ పట్ల అవగాహన కల్పించేందుకే
ఈ సర్వీస్ను ఆఫర్ చేస్తున్నామని
స్కొడా ఇండియా మార్కెటింగ్ హెడ్ కమస్ బసు
తెలిపారు.
0 comments:
Post a Comment