అనంతపురం:
మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రెండు
గంటల పాటు అదృశ్యమయ్యారని తెలుగుదేశం
పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. ఆ
సమయంలో జగన్ ఎక్కడికి వెళ్లారో
చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మద్దెలచెర్వు సూరి, పరిటాల రవి
హత్యలతో జగన్కు సంబంధం
లేదని వంశీ చెప్పడం సరికాదని,
వంశీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన మంగళవారం మీడియా
ప్రతినిధులతో అన్నారు.
సూరి,
పరిటాల రవి హత్యల్లో జగన్
ప్రమేయం ఉందని పయ్యావులు అన్నారు.
పరిటాల రవి హంతకుల వరుస
మరణాలపై సమగ్ర విచారణ చేపడితే
జగన్ పాత్ర వెలుగులోకి వస్తుందని
ఆయన అన్నారు. అక్రమ పెట్టుబడులతో వచ్చిన
సాక్షి దినపత్రిక తమ పార్టీ నాయకులపై
విషం చిమ్ముతోందని ఆయన విమర్శించారు.
తమ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ వైయస్ జగన్ను కలవడంపై పార్టీ
నాయకత్వం వివరణ కోరిందని, వంశీ
సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు
ఉంటాయని ఆయన చెప్పారు. వైయస్
జగన్ను వల్లభనేని వంశీ
విజయవాడ రోడ్డు మీద కలిసి మాట్లాడడం
వివాదంగా మారింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వంశీ జగన్ను
కలిశారనే మాట వినిపిస్తోంది.
వైయస్
జగన్పై తెలుగుదేశం పార్టీ
తీవ్ర ఆరోపణలు చేస్తోంది. పరిటాల రవి హత్య విషయంలోనే
కాకుండా మద్దెలచెర్వు సూరి హత్య విషయంలో
తెలుగుదేశం పార్టీ జగన్ను లక్ష్యం
చేసుకుని విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తమ
పార్టీకి చెందిన వల్లభనేని వంశీ జగన్ను
కలుసుకోవడం తెలుగదేశం పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు.
0 comments:
Post a Comment