కర్నూలు:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, కర్నూలు జిల్లాకు
చెందిన ఆళ్లగడ్డ తాజా మాజీ శాసనసభ్యురాలు
శోభా నాగి రెడ్డి భర్త
భూమా నాగి రెడ్డిపై స్థానిక
పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జెండాలు కట్టనివ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నందుకు ఆయనపై పోలీసులు కేసు
నమోదు చేశారు.
భూమా
నాగి రెడ్డి, ఆయన అనుచరులపై టిడిపి
కార్యకర్త తిరుపతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు
నమోదు చేసుకున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఆళ్లగడ్డలో పర్యటించిన సమయంలో తమ పార్టీ జెండాలు
కట్టనీయకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకుంటోందని టిడిపి విమర్సలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు
అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను
మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. దీంతో తెలుగుదేశం పార్టీ
నేతలు ఆందోళనకు దిగారు.
అధికారుల
వైఖరిని నిరసిస్తూ స్థానిక పోలీసు స్టేషన్ను ముట్టడించారు. బ్యానర్లు
తొలగించబోమని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో టిడిపి
కార్యకర్తలు తమ ఆందోళనను విరమించారు.
కాగా
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకున్న
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్థానిక నేతలు, రాయచోటి ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. విబేధాలు పక్కన బెట్టి పార్టీ
విజయానికి కృషి చే యాలని
నేతలకు బాబు సూచించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు
అనంతలో మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్మికులు మరణిస్తే తక్షణం ఆదుకునేలా ఆపద్భంధు పథకం తమ హయాంలో
ప్రారంభించిన విషయాన్ని బాబు ఈ సందర్భంగా
గుర్తు చేశారు. అసంఘటిత రంగ కార్మికులను కాంగ్రెసు
నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
0 comments:
Post a Comment