ఆ మధ్యన మహేష్ బాబు
బిజినెస్ మ్యాన్ చిత్రాన్ని తమిళంలో డబ్ చేసి ఘనంగా
విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేసారు. అయితే అనుకోని విధంగా
ధియోటర్స్ దొరక్క పోవటంతో వాయిదా వేసారు. సూర్య సోదరుడు జ్ఞానవేల్
రాజా ఈ చిత్రం రీమేక్
రైట్స్,డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారు. అయితే ఇప్పుడా డీల్
లేదని,రీమేక్ ఆలోచన లేదని చెప్తున్నారు.
స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని
కేవలం డబ్బింగ్ చేసి వదులుతారని చెప్పుతున్నారు.
అయితే అదీ కార్య రూపం
దాల్చలేదు. దమ్ము చిత్రం ఇదే
సమస్య ఎదుర్కొంది. తెలుగుతో పాటే 27న మొదట విడుదల
చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మే
4 న అన్నారు. ఆ రోజూ విడుదల
కాలేదు.
అయితే
దమ్ము విడుదల కాకపోవటానికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు. 27న తెలుగులో రిలీజైన
ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావటంతో అక్కడ
డబ్బింగ్ చేసి వదలటం వల్ల
పెద్దగా ప్రయోజనం ఉండదేమోనని బావించే ఆలస్యం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అక్కడ ట్రేడ్ లో
ఈ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఎవరూ పెద్దగా ఆసక్తి
చూపకపోవటంతో అక్కడక్కడ మొక్కుబడికి విడుదల చేయటం కన్నా పూర్తిగా
మానుకోవటం బెస్ట్ అని అంటున్నారు. అయితే
సెన్సార్ లేటవటం వల్లే మొన్న శుక్రవారం
డేట్ ప్రకటించినప్పటికీ విడుదల చేయలేకపోయామని నిర్మాతలు చెప్పటం విశేషం.
ఇక దమ్ము కలెక్షన్స్ గురించి
నిర్మాత కె.ఎస్.రామారావు
మాత్రం అదిరిపోతున్నాయని చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ...మేము
నిర్మించిన దమ్ము చిత్రం మా
ఊహకు అందని విధంగా ఫస్ట్
వీక్ 31 కోట్లు కలెక్టు చేసిందని చెప్పటానికి నేను ఆనందపడుతున్నాను. ఎన్టీఆర్
కెరీర్ లో కూడా ఇవి
బెస్ట్ ఓపినింగ్ కలెక్షన్స్. ఈ చిత్రం కేవలం
ఆయన ఎంత క్రౌడ్ పుల్లరో
చెప్తోంది. ఎన్టీఆర్ పవర్ ఏమిటో ఈ
చిత్రం చూపెట్టింది. ఆయన ఫెరఫార్మెన్స్ సినిమాలో
హైలెట్. ఆ క్రెడిట్ దర్శకుడు
బోయపాటి శ్రీనుకే చెందుతుంది అన్నారు.
బోయపాటి
శ్రీను దర్సకత్వంలో ఎన్టీఆర్,త్రిష,కార్తీక కాంబినేషన్
లో తెరకెక్కిన చిత్రం 'దమ్ము'. భానుప్రియ, నాజర్, సుమన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
శుభలేఖ సుధాకర్, అలీ తదితరులు ఇతర
పాత్రధారులు. రచన: ఎమ్.రత్నం,
పాటలు: చంద్రబోస్, కెమెరా: ఆర్థర్ విల్సన్. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత.
కె.ఎస్.రామారావు సమర్పకులు.
0 comments:
Post a Comment