సిల్క్
స్మిత జీవిత చరిత్ర ఆధారంగా
రూపొందిన డర్టీ పిక్చర్ హిందీలో
సూపర్ హిట్ అయ్యింది. దాంతో
ఈ చిత్రం తెలుగు,తమిళ భాషల్లో రీమేక్
చేయాలని ఏక్తా కపూర్ నిర్ణయించుకుందని
అందుకు తగిన హీరోయిన్ కోసం
వెతికింది. అయితే అనూష్క,నయనతార
ఇలా అందరూ తాము అలాంటి
పాత్రల్లో చేయలేమని చేతులెత్తేసారు. అయితే రిచా గంగోఫాధ్యయ
ఈ పాత్ర చేయటానికి ఆసక్తి
చూపింది. అయితే ఆమెతో చేయటానికి
ఏక్తా కపూర్ ఇంట్రస్ట్ చూపలేదు.
ఈ నేపధ్యంలో వేరే టీమ్ సిల్క్
స్మిత కథతో సినిమా చేస్తూ
రిచాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ
చిత్రం తమిళ,మళయాళ,తెలుగు
భాషల్లో నిర్మిస్తారని తెలుస్తోంది.
'ది డర్టీ పిక్చర్' చిత్రం
సిల్క్ లోని భిన్న కోణాలను
సరిగ్గా ఆవిష్కరించలేదని మలయాళ చిత్ర పరిశ్రమ
భావించి ఈ నిర్ణయం తీసుకున్నానంటోంది.
సిల్క్ స్మితతో కలిసి పలు మలయాళ
సినిమాలకు పనిచేసిన సినీ బృందం 'ప్రొఫైల్'
పేరిట ఒక సినిమాను రూపొందించాలనే
ప్రయత్నాల్లో పడింది. సిల్క్ స్మితను మలయాళ చిత్రసీమకు పరిచయం
చేసిన ఆంథోనీ ఈస్ట్మన్ కథా
రచనలో నిమగ్నమయ్యారు. ప్రముఖ స్క్రిప్ట్ రచయిత కలూర్ డెన్నిస్
కూడా ఈ చిత్ర నిర్మాణంలో
పాల్గొంటున్నారు. అనిల్ దర్శకత్వంలో నిర్మితమయ్యే ఈ చిత్రం షూటింగ్
జూన్ నెలలో ప్రారంభమవుతుంది.
'లీడర్',
'మిరపకాయ్', తదితర తెలుగు చిత్రాల్లో
నటించిన రిచా గంగోపాధ్యాయతో సిల్క్
స్మిత పాత్రకి కరెక్టుగా సూట్ అవుతుందని వారు
చెప్తున్నారు. రిచా సైతం ..అప్పటివరకు
హోమ్లీగా కనిపించిన విద్యాబాలన్ ఈ చిత్రంలో హద్దులు
దాటి నటించినా ఆ పాత్రకు ప్రజలు
నీరాజనం పెట్టడంతో ఈ పాత్రపై ఇంట్రెస్ట్
చూపెడుతోంది. 80వ దశకం నుంచి
దాదాపు 17 సంవత్సరాల కాలానికి దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన
సిల్క్ స్మిత అనేక మలయాళ
చిత్రాల్లో కూడా నటించింటంతో ఆ
రిఫెరెన్స్ లను తమ సినిమాలో
వాడనున్నారు.
ఇక రిచా కూడా తమిళంలో
ఆమె చేసిన ఓస్తి చిత్రం
ఫెయిల్యూర్ అవ్వటంతో పెద్దగా ఆఫర్స్ లేక ఖాళీగా ఉంది.
తెలుగులో సైతం ఆమెకు హీరోయిన్
గా ఆఫర్స్ కరవయ్యాయి. ఈ నేపధ్యంలో ఏదో
ఒక సెన్సేషన్ తో ఆమె మళ్లీ
అందరినీ ఆకర్షించాలనే ప్రయత్నాల్లో ఉంది. సిల్క్ కథ
అయితే తన కెరీర్ కి
బ్రేక్ ఇచ్చినట్లు ఉంటుంది...తనలోని గ్లామర్ కోణం ఆవిష్కరించినట్లు ఉంటుంది..అదే పనిలో అవార్డులు
సైతం వరిస్తాయని ఆసగా ఎదురుచూస్తోంది.
0 comments:
Post a Comment