హైదరాబాద్:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
రెండు రోజులుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో
సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రియే జగన్కు తొలి
కోవర్టు అని డిఎల్ వ్యాఖ్యానించిన
విషయం తెలిసిందే. అంతేకాదు ఆయనకు దమ్ముంటే జగన్ను విమర్శించాలని సవాల్
చేశారు. సిఎం ఇప్పటి వరకు
జగన్ను విమర్సించలేదని ఆరోపించారు.
డిఎల్
వ్యాఖ్యల ప్రభావమో మరేమో కానీ ఆ
తర్వాత నుండి కిరణ్ కుమార్
రెడ్డి మాత్రం జగన్ పైన విరుచుకు
పడుతున్నారు. ప్రతి నియోజకవర్గం ప్రచార
సభలోనూ, కార్యకర్తల సమావేశంలోనూ సిఎం రెండు రోజులుగా
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేతనే ఆయన లక్ష్యంగా చేసుకొని
మాట్లాడుతున్నారు. అయితే జగన్ పైన
కిరణ్ విమర్శనాస్త్రాలు సంధించినప్పటి నుండి కాంగ్రెసు కార్యకర్తలలో,
నేతలలో కొత్స ఉత్సాహం కనిపిస్తోందని
అంటున్నారు.
సోమవారం
తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం ఉప ఎన్నికల ప్రచారంలో
ముఖ్యమంత్రి, తాను పార్టీ విషయంలో
కొన్నిసార్లు తప్పు చేశానని వైయస్
ఓసారి చెప్పారని, కానీ ఎవరూ కూడా
జీవితంలో అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారని, ఆ సమావేశంలో వైయస్
జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పారు.
కానీ జగన్ మాత్రం తండ్రి
మాటలు బేఖాతరు చేస్తూ కాంగ్రెసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైయస్ మాటలను అతను
ఎందుకు విస్మరించాడో తనకు అర్థం కావడం
లేదన్నారు.
దివంగత
వైయస్కు భిన్నంగా జగన్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో
కలిసి కాంగ్రెసు ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కుయుక్తులు
పన్నారన్నారు. టిడిపి అవిశ్వాసానికి జగన్ మద్దతిచ్చినందు వల్లే
ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలనుకున్నారో చెప్పాలని జగన్ను కిరణ్
ప్రశ్నించారు.
జగన్
డెబ్బై గదుల ఇళ్లు కట్టుకున్నారని,
ప్రజా నాయకుడికి ముఖ్యంగా సిఎం కావాలనుకుంటున్న వ్యక్తి
అలాంటి ఇళ్లు కట్టుకొని ప్రజలకు
ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. జగన్ మెంటాలిటీ నాకు
అర్థం కావడం లేదన్నారు. అంతకుముందు
రోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కిరణ్ ఉప ఎన్నికల
ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా
రోజుల తర్వాత కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు
అధినేతపై విమర్శలు చేశారు.
కాంగ్రెసు
ప్రభుత్వాన్ని కూల్చేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని
ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
తాను చనిపోయేంత వరకు కాంగ్రెసు కోసం
పాటుపడతానని చెప్పారన్నారు. కానీ ఆయన కడుపున
పుట్టిన జగన్ మాత్రం అదే
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆ కుట్ర ఫలితమే
ప్రస్తుత ఉప ఎన్నికలు అన్నారు.
జగన్పై కిరణ్ చెలరేగటం
చూస్తుంటే డిఎల్ కోవర్టు వ్యాఖ్యలకు
కౌంటర్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
0 comments:
Post a Comment