హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ భారతీయ శిక్షా
స్మృతి సెక్షన్ 120-బి రెడ్ విత్,
420, 409, 420, 468, 471, అవినీతి
నిరోధక చట్టం సెక్షన్ 13(2), రెడ్
విత్ 13(1)(సి)(డి) కింద
కేసు నమోదు చేసింది. ఆయా
సెక్షన్ల క్రింద నేరం రుజువైతే నేరస్తుడికి
ఈ క్రింది విధంగా శిక్ష పడే అవకాశం
ఉంది.
సెక్షన్
420 - దగా, మోసం క్రింద నేరం
రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష,
జరిమానా విధించవచ్చు.
సెక్షన్
409 - కుట్రపూరితమైన నమ్మక ద్రోహం క్రింద
నేరం రుజువైతే యావజ్జీవం లేదంటే పదేళ్ల జైలు శిక్ష, జరిమానా
విధించవచ్చు.
సెక్షన్
477 - ఖాతాలను తారుమారు చేయడం క్రింద నేరం
రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష జరిమానా
విధించవచ్చు.
సెక్షన్
468 - ఫోర్జరీ పత్రాలను ఒరిజినల్ పత్రాలుగా చూపి మోసగించడం క్రింద
నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష
విధించే అవకాశముంది.
సెక్షన్
471 - ఎవరినైనా మోసం చేయడానికి ఫోర్జరీ
పత్రాలను, రికార్డులను ఉపయోగించడం క్రింద నేరం రుజువైతే ఏడేళ్ల
జైలు శిక్ష విధించే అవకాశముంది.
సెక్షన్
120బి - కుట్ర క్రింద నేరం
రుజువైతే ఆరు నెలల జైలు
శిక్ష, జరిమానా విధించే అవకాశముంది.
అవినీతి
నిరోధక చట్టం సెక్షన్లు
సెక్షన్
13(2) - ప్రభుత్వ హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే కనీసం ఏడాది నుండి
ఏడేళ్ల వరకు జైలు శిక్ష
విధించవచ్చు. జరిమానా కూడా విధించవచ్చు.
సెక్షన్
13(1)(డి) - అవినీతికి పాల్పడటం వల్ల స్వయంగా కానీ,
మరో వ్యక్తి ద్వారా కానీ భారీగా లబ్ధి
పొందడం, బహుమతులు స్వీకరించినట్లు తేలితే కనీసం ఏడాది నుండి
ఏడేళ్ల వరకు జైలు శిక్ష
జరిమానా విధించవచ్చు.
0 comments:
Post a Comment