ఎన్టీఆర్,
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన దమ్ము
చిత్రం రెండు వారాల క్రితం
విడుదలైన సంగతి తెలిసిందే. డివైడ్
టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో డల్ కాకుండా
వెళ్తున్న ఈ చిత్రం వైజాగ్
డిస్ట్ర్రిబ్యూటర్స్ ద్వారా మోసానికి గురి అవుతోందని ఫిల్మ్
సర్కిల్స్ లోనూ,ట్రేడ్ లోనూ
గత రెండు రోజులుగా వినిపిస్తోంది.
వారు చెప్పే కథనం ప్రకారం తప్పుడు
డైలీ కలెక్షన్ రిపోర్టులు చూపించి మోసం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
ఈ మోసం గురించి నిర్మాత
కె.ఎస్ రామారావు కి
తెలిసినా ఆ డిస్ట్రిబ్యూటర్ ..ఎన్టీఆర్
కి కావాల్సిన వాడు కావటంతో అతని
మాట కోసం వెయిట్ చేస్తున్నాడని
వినికిడి.
ఇక ట్రేడ్ లో వినపడుతున్న ఈ
టాక్ లో ...వైజాగ్ ఏరియాను
భరత్ ఫిక్చర్స్ వారు తీసుకున్నారు. రిలీజ్
కు ముందు వారు బ్యాకింగ్
ఉండేటట్లు నిర్మాత స్వయంగా రిలీజ్ చేసుకునేటట్లు ప్లాన్ చేసారు. అయితే చివరి నిముషంలో
లెక్కలు మారి ధియోటర్ కౌంట్,ఎగ్రిమెంట్స్ ఆల్రెడీ జరిగిపోవటంతో ఏమీ చేయలేక భరత్
పిక్చర్స్ వారికే ఇవ్వాల్సి వచ్చింది. అయితే రిలీజ్ అయ్యాక
ఆ డిస్ట్రిబ్యూటర్స్ రెండు సెపరేట్ డైలీ
కలెక్షన్ రిపోర్టులు మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి తమకోసం మరొకటి
నిర్మాతకు లెక్కలు తగ్గించి చూపటానికి అని చెప్తున్నారు. దాంతో
ఆ బ్యాలెన్స్ మొత్తం నిర్మాతకు రాకుండా డిస్ట్రిబ్యూటర్ జేబులోకి పోతుంది.
ఈ నేపధ్యంలో దమ్ము మొదటి వారం
కలెక్షన్ లో చాలా తేడా
చూపించారని అంటున్నారు. ఎన్టీఆర్ కు రెగ్యులర్ ప్రొడ్యూసర్
కావటంతో అతని మాట కోసం
వెయిట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన మొదటి మ్యారేజ్
ఏనవర్శరి సెలబ్రేషన్స్ నిమిత్తం హ్యాలెడీ ట్రిప్ లో ఉన్నారు. ఆయన
ట్రిప్ నుంచి వచ్చాక ఈ
లెక్కలు విషయం తేలుతుందని చెప్పుకుంటున్నారు.
ఇక దమ్ము కలెక్షన్స్ ..గబ్బర్
సింగ్ వచ్చాక ధియోటర్స్ తగ్గి ఏ రేంజికి
పడిపోతాయో అన్న టెన్షన్ కూడా
ట్రేడ్ లో కనపడుతోంది. మరో
రెండు వారాల పాటు గట్టిగా
కలెక్షన్స్ వసూలు అయితే కానీ
కొన్నవారు హ్యాపీగా ఉండలేరని చెప్తున్నారు.
ఇక దమ్ము కలెక్షన్స్ గురించి
నిర్మాత కె.ఎస్.రామారావు
మాత్రం అదిరిపోతున్నాయని చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ...మేము
నిర్మించిన దమ్ము చిత్రం మా
ఊహకు అందని విధంగా ఫస్ట్
వీక్ 31 కోట్లు కలెక్టు చేసిందని చెప్పటానికి నేను ఆనందపడుతున్నాను. ఎన్టీఆర్
కెరీర్ లో కూడా ఇవి
బెస్ట్ ఓపినింగ్ కలెక్షన్స్. ఈ చిత్రం కేవలం
ఆయన ఎంత క్రౌడ్ పుల్లరో
చెప్తోంది. ఎన్టీఆర్ పవర్ ఏమిటో ఈ
చిత్రం చూపెట్టింది. ఆయన ఫెరఫార్మెన్స్ సినిమాలో
హైలెట్. ఆ క్రెడిట్ దర్శకుడు
బోయపాటి శ్రీనుకే చెందుతుంది అన్నారు.
0 comments:
Post a Comment