పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా
వస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంపై మరో వివాదం నెలకొంది.
ఈచిత్రంపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ చిత్రంలో పవన్
కళ్యాణ్ ధరించిన డ్రెస్సు, అతని పాత్ర పోలీసుల
కించ పరిచేలా ఉందని, వెంటనే అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు చలపతిరావు
డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాత
బండ్ల గణేష్ మంత్రి బొత్సాకు
బినామీగా ఉంటూ ఆడబ్బుతో గబ్బర్
సింగ్ చిత్రం నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ ఈచిత్రంలో
కొండవీడు పోలీస్ గా నటిస్తున్నారు. …అతను
ఖాకీ కడితేనే పోలీసు. నెత్తి మీద టోపీ ఉన్నంతసేపూ
సెక్షన్ల గురించి, చట్టాల గురించి పట్టించుకుంటాడు. లాఠీ పక్కనపెడితే అతనికంటే
పెద్ద రౌడీ ఉండడు. కేడీగాళ్లను
దారిలోకి తీసుకురావాలంటే… ఈ పద్ధతే సరైనదని అతని నమ్మకం. ఓవరాల్గా ఇది ఓ
కిలాడీ పోలీస్ స్టోరీ.
సినిమా
పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ‘కెవ్వు కేక’ అనే ప్రత్యేక గీతం
మాస్ని అలరిస్తుంది. ఈ
పాటలో బాలీవుడ్ హాట్ లేడీ మలైకా
అరోరా నటించింది. సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్
హిట్ చిత్రం ‘దబంగ్’ను తెలుగులో ‘గబ్బర్
సింగ్’
పేరిట రీమేక్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ పాత్రను పవన్
కళ్యాణ్ పోషిస్తుండగా శృతి హాసన్, సుహాసిని,
అభిమన్యు సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో
కనిపిస్తారు. రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో
చిత్రీకరించే ఆ ఫైట్ సీన్స్
కు పవన్ తనదైన స్టైల్
జోడిస్తున్నట్టు సమాచారం.
పరమేశ్వర
ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ
భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్,
కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.
0 comments:
Post a Comment