కొత్త
దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త
నటులతో వచ్చిన స్మాల్ బడ్జెట్ సినిమా ‘ఈరోజుల్లో..’ ఎవరూ ఊహించని విధంగా
సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ చిత్రం 50 రోజులు
పూర్తి చేసుకుంది. ఈ సినిమా విడుదలన
కొత్తలో ఇదో బూతు సినిమా
అనే అపవాదు కూడా వచ్చింది.
ఈ చిత్రం గురించి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ మధ్య మాట్లాడుతూ...‘‘
ఈరోజుల్లో' సినిమాను చూసిన వారు కొందరు
అంతా బూతేనని సెన్సార్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారు.
నేను కాకినాడలో కొందరు యువతీయువకుల్ని కలిసి 'బూతు ఉందట కదా
సినిమాలో' అని అడిగాను. అందుకు
వాళ్ళు సమాధానం ఇస్తూ... 'వ్యవహారిక భాషనే కదా సార్
వాడారు. అందులో బూతు ఏముంది?' అన్నారు.
సినిమాల్లో మంచీ చెడు ఎప్పుడూ
ఉన్నాయి. మనం చూసేదాన్ని బట్టి
ఉంది. ఇందులో నా పాత్రకు కూడా
మంచి స్పందన వస్తున్నందకు ఆనందంగా ఉంది’’ అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
50 రోజులు
పూర్తయిన సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలు ఓ
ప్రెస్ నోట్ విడుదల చేశారు.
మార్చి 23న విడుదలైన తమ
చిత్రం ఈ నెల 11తో
53 కేంద్రాలకు పైగా 50 రోజులు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ... కంటెంట్‌ను మాత్రమే నమ్ముకున్నానని,
ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, మా
నిర్మాతలకి, చిత్ర యూనిట్ సభ్యులకు
ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
ఈ రోజుల్లో చిత్రం విడుదలైన రోజే నిర్మాత బెల్లంకొండ
సురేష్ గారు తనకు మరో
సినిమా చేసే అవకాశం ఇచ్చారని,
ఈ సారి కూడా పూర్తిగా
కథను నమ్ముకునే సినిమా తీస్తానని, స్టార్లను నమ్ముకోకుండా తక్కువ బడ్జెట్లో ఒక మంచి
సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తానని మారుతి చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment