న్యూఢిల్లీ:
తమ పార్టీ విజయవాడ నాయకుడు వల్లభనేని వంశీతో తనకూ తన కుమారుడు
జూనియర్ ఎన్టీఆర్కూ సంబంధం ఏమిటని
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అడిగారు. జూనియర్ ఎన్టీఆర్తో వల్లభనేని వంశీ
సినిమా తీసినంత మాత్రాన సంబంధాలు ఉన్నట్లేనా అని ఆయన అడిగారు.
బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో
ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్తో వంశీ సినిమాలు
తీసినంత మాత్రాన సంబంధాలున్నాయని అంటారా అని ఆయన అన్నారు.
పార్టీలో
ఉన్నప్పుడు వంశీ క్రమశిక్షణ గల
కార్యకర్తగా వ్యవహరించాల్సిందేనని ఆయన అన్నారు. పార్టీలో
క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని ఆయన అన్నారు.
తమకు వంశీతో ఏ విధమైన సంబంధాలు
లేవని ఆయన అన్నారు. చాలా
కాలంగా మౌనం వహించిన హరికృష్ణ
వల్లభనేని వంశీ వ్యవహారంపై బుధవారం
గొంతు విప్పారు. ఆయన బుధవారం తెలుగుదేశం
పార్లమెంటు సభ్యుల మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా
సంస్థల బ్యాంకు ఖాతాల స్తంభన వ్యవహారాన్ని
ప్రస్తావిస్తూ జగన్పై తీవ్రంగా
ధ్వజమెత్తారు. అయితే, హరికృష్ణ మీడియా సమావేశంలో కూర్చున్నా తాను మాట్లాడలేదు.
విజయవాడలో
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ను
రోడ్డుపై బహిరంగంగా వంశీ కలవడంపై తీవ్ర
దుమారం చెలరేగింది. వైయస్ జగన్పై
తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న
నేపథ్యంలో వంశీ వ్యవహారం కలకలం
రేపింది. వంశీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ
షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు.
ఆ షోకాజ్ నోటీసుకు వంశీ చంద్రబాబును కలిసి
వివరణ ఇచ్చారు.
వంశీ
వైయస్ జగన్ను కలుసుకోవడం
వెనక సినీ హీరో జూనియర్
ఎన్టీఆర్ పాత్ర ఉందనే వార్తాకథనాలు
వచ్చాయి. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్
ఎన్టీఆర్ వంశీకి మద్దతు ఇస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే,
ఈ వార్తాకథనాలపై హరికృష్ణ నుంచి ఇప్పటి వరకు
వివరణ రాలేదు.
0 comments:
Post a Comment