హరీశ్శంకర్ దర్శకత్వంలో పరమేశ్వర
ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై గణేష్ బాబు నిర్మించిన
'గబ్బర్సింగ్' సినిమా ఇటీవల విడుదలై ఘన
విజయం సాధించిన సంగతి తెలిసిందే. పవన్
కళ్యాణ్ కి ఖుషీ తర్వాత
దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత ఈ రేంజి హిట్
రావటంతో అభిమానలు పండగ చేసుకుంటున్నారు. ఈ
నేపధ్యంలో ఈ చిత్రం 50 డేస్
ఫంక్షన్ ఘనంగా జరపాలని గణేష్
ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దానికి తోడు బాలీవుడ్ స్టార్
హీరో సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు
హాజరు అవుతానని మాట ఇచ్చాడని తెలుస్తోంది.
అయితే ఈ పంక్షన్ కి
పవన్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.
రీసెంట్
గా గబ్బర్ సింగ్ లోని కొన్ని
సీన్స్ ని సల్మాన్ ఖాన్
కొనుగోలు చేసారు. అప్పుడు కలిసిన గణేష్ తో ఈ
హామీ సల్మాన్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. “గబ్బర్ సింగ్” లో హైలెట్ గా
నిలిచిన కొన్ని సీన్స్ రైట్స్ ని సల్మాన్ ఖాన్
తన తదుపరి చిత్రం “దబాంగ్ -2″ కోసం వీటిని తీసుకున్నారు.
అందునిమిత్తం బండ్ల గణేష్ తో
యాభై లక్షలు చెల్లించటానికి ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు చెప్తున్నారు. ఇంతకీ ఆ సీన్స్
ఏమిటో మీరు ఈ పాటికి
ఊహించే ఉంటారు. అవి ..సెంకండాఫ్ లో
వచ్చే అంత్యాక్షరి సీన్,కట్ అవుట్
సీన్. అలాగే ఫస్టాఫ్ లో
వచ్చే కబడ్డి సీన్స్ ను కూడా తీసుకున్నట్లు
తెలుస్తోంది.
దబాంగ్
రైట్స్ తీసుకుని ఇక్కడ రీమేక్ చేసి
మళ్లీ వారికే చిత్రం లోని కొన్ని సీన్స్
ని అమ్మటం మామూలు విషయం కాదంటున్నారు. ఇది
దర్శకుడు హరీష్ శంకర్ కీ,పవన్ కి, మొత్తం
టీమ్ కి దక్కిన అరుదైన
గౌరవంగా చెప్తున్నారు. ఇక ధియోటర్స్ లో
ఈ సీన్స్ కు వస్తున్న అప్లాజ్
చూసి సల్మాన్ ఆశ్చర్యపోయారట. అందుకే తను సీక్వెల్ చేస్తున్న
చిత్రంలో ఇవి హైలెట్ అవుతాయని
భావిస్తున్ట్లు చెప్తున్నారు.
ఇన్నాళ్లూ
తెలుగు హీరోల చిత్రాలు తాను
రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్
చేసి అంత పెద్ద హిట్
కొట్టడం ఆయనికి విచిత్రంగా ఉంది. ఈ విషయమై
సల్మాన్ మాట్లాడుతూ... సౌత్ లో హీరోలను
దేముడులా ఆరాధిస్తారని తెలుసు. కానీ నేను ఓ
హీరోకి ఇంత ఫాలోయింగ్, ఇంత
క్రేజ్ ఊహించలేదు. ఈ మానియా చూస్తూంటే,
నాకూ తెలుగులో ఓ చిత్రం చేయాలనిపిస్తోంది
అన్నారు. గబ్బర్ సింగ్ ఓవర్ సీస్
లో కూడా దబాంగ్ కన్నా
ఎక్కువ బిజినెస్ చేస్తోందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు తరుణ్ ఆదర్స్ లాంటివాళ్లు
చెప్తున్నారు. ఇక సల్మాన్ ఈ
చిత్రంలోని కెవ్వు కేక పాటకు చాలా
ఇంప్రెస్ అయ్యాడని, తన దబాంగ్ 2లో
ఆ పాటను పెట్టే అవకాశముందని
బాలీవుడ్ టాక్.
0 comments:
Post a Comment