రాజ్యసభ
సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవిపై
మంత్రి గల్లా అరుణ కుమారి
గుర్రుగా ఉన్నారట. తిరుపతి నియోజకవర్గం టిక్కెట్ను తన తనయుడు
గల్లా జయదేవ్కు ఇప్పించేందుకు అరుణ
తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఆమె ఢిల్లీ వెళ్లి
పెద్దల వద్ద కూడా మొరపెట్టుకున్నారు.
అయితే తీరా చూస్తే ఎంపిక
చేసిన అభ్యర్థుల పేర్లలో మాత్రం గల్లా జయదేవ్ పేరు
లేదు. దీంతో అరుణ తీవ్ర
అసంతృప్తికి గురయ్యారు.
తన తనయుడికి తిరుపతి టిక్కెట్ రాకపోవడం వెనుక చిరంజీవే ఉన్నారని
ఆమె భావిస్తున్నారని అంటున్నారు. వెంకట రమణకు టిక్కెట్
కేటాయిస్తున్నారని తెలిసి, మూడు రోజుల క్రితం
ఆమె చిరంజీవి ఇంటికి వెళ్లి తన తనయుడికి టిక్కెట్
ఇప్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి స్థానం చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయినందున అక్కడి
అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్టానం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని
అంటున్నారు.
చిరంజీవితో
పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కూడా వెంకట రమణ వైపు
మొగ్గు చూపడంతో ఆయన పేరు ఖరారైందని
అంటున్నారు. ముఖ్యమంత్రి జరిపిన సర్వేలో వెంకట రమణకు టిక్కెట్
ఇస్తేనే గెలుస్తారని తేలిందట. అందుకే కిరణ్ ఆయన వైపు
మొగ్గు చూపారని అంటున్నారు. చిరంజీవి కూడా జయదేవ్కు
టిక్కెట్ ఇవ్వడంపై విముఖత చూపడం వల్లనే రాలేదని
అంటున్నారు.
ప్రత్యేకంగా
విజ్ఞప్తి చేసినప్పటికీ సహకరించక పోవడంతో ఆమె చిరంజీవిపై గుర్రుగా
ఉన్నారని అంటున్నారు. తన తనయుడి గెలుపు
ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించినప్పటికీ సహకరించక పోవడాన్ని ఆమె తప్పు పడుతున్నారట.
అయితే దీంతో ఆమె తిరుపతిలో
వెంకట రమణకు సహకరించే అవకాశాలు
తక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎవరికి టిక్కెట్ ఇచ్చినప్పటికీ తాను గెలిపించేందుకు కృషి
చేస్తానని ఆమె పలుమార్లు ప్రకటించిన
విషయం తెలిసిందే.
తిరుపతి
నియోజకవర్గం మిగిలిన పదిహేడు నియోజకవర్గాల కన్నా భిన్నమైనది. ఇది
సొంత నియోజకవర్గం కాబట్టి కాంగ్రెసుకు, ప్రత్యేకంగా చిరంజీవికి మరింత ప్రతిష్టాత్మకం. ఇక్కడ
గెలుపు కాంగ్రెసు కంటే చిరంజీవికే అధిక
అవసరం. అయితే ఇప్పుడు గల్లా
అరుణ కుమారితో పేచీ కారణంగా ఆమె
సహకారం చిరుకు లభించదనే వాదనలు వినిపిస్తున్నాయి. టిక్కెట్ ఇప్పించలేక పోయినందుకు ప్రచారంలో పాల్గొనకుండా చిరంజీవికి హ్యాండ్ ఇచ్చేందుకే ఆమె సిద్ధంగా ఉన్నారని
అంటున్నారు.
0 comments:
Post a Comment