హైదరాబాద్:
స్వప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలకు తాను తలొగ్గనని, ఎటువంటి
పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు కూడా సంయమనం కోల్పోవద్దని,
శాంతియుతంగా ఉండాలని సిబిఐ అరెస్టు చేసిన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తన సందేశాన్ని పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు స్పష్టం చేయాలని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, తదితర నేతలకు
వివరించారు. ఈ మేరకు వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ
తెలిపింది. రాబోయే ఉప ఎన్నికల నేపథ్యంలో
శాంతి, సుహృద్భావాలతో ఉండడం అత్యవసరమని, ఎటువంటి
హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడవద్దని జగన్ పేర్కొన్నట్లు వివరించింది.
కాగా
జగన్ సతీమణి వైయస్ భారతి, సోదరి
షర్మిళ సోమవారం ఉదయం దిల్ కుషా
అతిథి గృహం వద్ద వైయస్
జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం వారు తిరిగి లోటస్
పాండుకు తిరిగి వచ్చారు. కాగా రాత్రి నుండి
లోటస్ పాండు వద్ద వైయస్
విజయమ్మ తన దీక్షను కొనసాగిస్తున్నారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఉప ఎన్నికల బాధ్యతను
వైయస్ విజయమ్మకు అప్పగించే అవకాశం ఉంది. దీక్ష విరమించాల్సిందిగా
వైయస్సార్ కాంగ్రెసు సెంట్రల్ గవర్నింగ్ కమిటీ ఆమెను కోరనున్నారు.
ఆమెచే దీక్ష విరమింపచేసి, ఉప
ఎన్నికల బాధ్యతలను అప్పగించే అవకాశముంది. ఉదయం పదిన్నర గంటలకు
గవర్నింగ్ కమిటీ భేటీ కానుంది.
కాగా
జగన్తో పాటు కార్యకర్తలు
మానసికంగా బలంగా ఉన్నారని, ఎవరూ
డిప్రెషన్లో లేరని శోభా
నాగి రెడ్డి అన్నారు. జగన్ బయటకు వచ్చే
వరకు విజయమ్మ పార్టీ బాధ్యతలను స్వీకరిస్తారని, పార్టీని పటిష్ట పరుస్తారని చెప్పారు. జగన్ రాత్రి అరెస్టయినప్పటి
నుండి దిల్ కుషా అతిథి
గృహంలోనే ఉన్నారు. అతనిని పదిన్నర గంటల ప్రాంతంలో నాంపల్లి
ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. అనంతరం కోర్టు నిర్ణయం మేరకు జ్యూడిషియల్ రిమాండుకు
గానీ, సిబిఐ కస్టడీకి గానీ
తరలించే అవకాశముంది.
0 comments:
Post a Comment