న్యూఢిల్లీ/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో సిబిఐ తరఫున, జగన్
తరఫున వాదించేందుకు యోధానుయోధులు రంగంలోకి దిగుతున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ఈ కేసులో వాదించేందుకు
హైదరాబాద్ చేరుకుంటున్నారు. వైయస్ జగన్ తరపున
సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, అమన్స్, సుశీల్ కుమార్ వాదించనున్నారు.
తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు
అక్రమాస్తులున్నాయంటూ వైయస్ విజయమ్మ సుప్రీం
కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు రామ్
జెఠ్మలానీ వైయస్ విజయమ్మ తరపున
వాదనలు వినిపించారు. ఇక... సిబిఐ తరపున
సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అశోక్ భాన్ హాజరు
కానున్నారు. ఆదివారం ఉదయమే ఆయన హైదరాబాద్కు పయనమయ్యారు. సిబిఐ
జెడి లక్ష్మీనారాయణతో కేసు పూర్వాపరాలపై చర్చించారు.
1943, అక్టోబర్
2న సంగ్రూర్ జిల్లాలోని మూనాక్ గ్రామంలో జన్మించిన అశోక్ భాన్ 1965లో
న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1969 నుంచి 1979 దాకా పంజాబ్ యూనివర్సిటీలో
తాత్కాలిక అధ్యాపకుడిగా న్యాయశాస్త్ర పాఠాలు బోధించారు. 1979 నవంబర్ నుంచి 1980 మార్చి దాకా పంజాబ్ అదనపు
అడ్వకేట్ జనరల్గా వ్యవహరించారు.
1982లో సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. 1983 నుంచి..
1990 జూన్ 13 దాకా సీనియర్ స్టాండింగ్
కౌన్సెల్గా చేశారు. అలాగే,
1963 నుంచి 1990 జూన్ 15 దాకా భారత ప్రభుత్వ
ఆదాయపన్ను విభాగానికి సీనియర్ న్యాయవాదిగా వ్యవహరించారు.
1990 జూన్
15న ఆయన పంజాబ్, చండీగఢ్
హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 అక్టోబరు 7న కర్ణాటక హైకోర్టుకు
బదిలీ అయ్యారు. 2000, జూన్ 26 నుంచి 2000, అక్టోబరు 20 దాకా కర్ణాటక హైకోర్టు
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2001 జూన్ 17న సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా
నియమితులైన అశోక్ భాన్.. 2008, అక్టోబరు
2న పదవీ విరమణ పొందారు.
2008 అక్టోబరు నుంచి ఆయన 'జాతీయ
వినియోగదారుల కమిషన్'కు చైర్మన్గా
వ్యవహరిస్తున్నారు.
జగన్ను సిబిఐ విచారణకు
పిలిపించడం, చివరకు అరెస్టుచేయడం... ఈ మొత్తం వ్యవహారాలపై
విదేశీ మీడియా కూడా ఎక్కడలేని ఆసక్తి
కనబరిచింది. ఈ వ్యాసాలను కొన్ని
పత్రికలతో పాటు వెబ్సైట్లు
కూడా సవివరంగా ప్రచురించాయి. ఖలీజ్ టైమ్స్, లండన్
కాలింగ్, న్యూస్వాచ్, ద న్యూస్హెరాల్డ్ లాంటి విదేశీ పత్రికలు
ఈ వార్తాకథనాలను ప్రచురించాయి. ఆదివారం ఉదయం 10.30 నుంచే దేశ విదేశాల్లో
ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. జగన్ను అరెస్టు
చేయొచ్చన్న పరోక్ష సూచనలు అందడం, పోలీసులు అప్రమత్తం కావడం వంటి విషయాలు
ప్రసారం కావడంతో దీనిపైనే చర్చోపచర్చలు సాగాయి.
0 comments:
Post a Comment