యంగ్
టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముసలి గెటప్లో
ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు
అంతర్జాలయంలో హల్ చల్ చేస్తోంది.
ఇందులో జూనియర్ తెల్లవెంట్రుకలు, నిలువు నామం, చేతిలో కర్రతో
కనిపిస్తున్నాడు. అయితే ఇది మార్ఫింగ్
ఫోటోనా? లేక జూ ఎన్టీఆర్
దమ్ము చిత్రం తర్వాత నటించబోతున్న ‘బాద్ షా’ చిత్రంలోనిదా? అనే విషయం మాత్రం
అర్థం కావడం లేదు.
అయితే
ఇది సీనియర్ ఎన్టీఆర్ ఫోను మార్ఫింగ్ చేసినట్లు
ఉందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జూనియర్
ఎన్టీఆర్ ఇలా ముసలి గెటప్లో తొలిసారిగా కనిపించడంతో
అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూనియర్ ఎలాంటి పాత్రనా అవలీలగా చేయగలడని, ఎలాంటి గెటప్లో అయినా
పర్ ఫెక్ట్గా సూటవుతాడని అభిమానులు
అంటున్నారు.
యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్-శ్రీను
వైట్ల కాంబినేషన్లో రూపొందబోతున్న బాద్షా చిత్రం
సరిగ్గా మరో 10 రోజుల్లో అంటే మే 10న
సెట్స్ పైకి రానుంది. తొలి
షెడ్యూల్ యూరఫ్లో ప్లాన్
చేశారు. ఈ మేరకు యూనిట్
సభ్యులంతా అక్కడి వెళ్లనున్నారు. రెండు నెలల పాటు
అక్కడ షూటింగ్ జరుగనుంది.
ఎన్టీఆర్
కథానాయకుడిగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న
‘బాద్షా’ సినిమాకు శ్రీనువైట్ల దర్శకుడు. కాజల్ అగర్వాల్ ఎన్టీఆర్
సరసన హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి
నాటికి బాద్ షా చిత్రం
ప్రేక్షకుల ముందుకు రానుంది.








0 comments:
Post a Comment