సినిమా
రంగంలో రాణించాలనే ఉత్సాహంతో ఉన్న కొత్త నటీనటులు,
దర్శకులకు ఆర్ ఆర్ మూవీమేకర్స్
వారు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.
ఆర్ఆర్ మూవీ మేకర్స్ బేనర్పై కొత్త నటీనటులతో
చిన్న చిత్రాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ విషయమై సంస్థ అధినేత డా.
వెంకట్ మాట్లాడుతూ..‘కొత్త నటీనటులతో, కొత్త
దర్శకులతో వరుసగా చిన్న చిత్రాలను నిర్మించడానికి
ప్లాన్ చేశాం. సరికొత్త కథాంశాలతో, పక్కా బౌండ్ స్క్రిప్టుతో
చిత్రాలు చేయడానికి రెడీగా ఉన్న న్యూ టాలెంట్ని ప్రోత్సహించడానికి ఆర్ఆర్
మూవీమేకర్స్ సంస్థ సిద్ధంగా ఉంది.
ఎన్ని మంచి సబ్జెక్ట్స్ దొరికితే
అన్ని చిత్రాల్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇకపై ఓ వైపు
భారీ చిత్రాలను నిర్మిస్తూ...మరో వైపు నాన్
స్టాప్గా చిన్న చిత్రాలను
కూడా నిర్మిస్తాం. ఆల్ రెడీ సబ్జెక్ట్స్
సెలక్షన్లో ఉన్నాం’ అని తెలిపారు.
హంగామా
చిత్రం నుంచి వరుసగా ఆర్ఆర్
మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాలను సూపర్ డూపర్ హిట్
చేస్తున్న ప్రేక్షకులకు ఈ సందర్భంగా వెంకట్
థాంక్స్ చెప్పారు. ప్రేక్షకులు అందించిన ఉత్సాహంతో మరిన్ని ప్రేక్షక రంజక సినిమాలు నిర్మిస్తామని
తెలిపారు.
ఆర్ ఆర్ మూవీ మేకర్స్
ఈ సంవత్సరం నిర్మించిన బిజినెస్ మేన్, పూల రంగడు,
లవ్ లీ చిత్రాలు భారీ
విజయం సాధించిన విషయం తెలిసిందే. మరో
డమరుకం, శ్రీమన్నారాయణ, ఆటో నగర్ సూర్య,
పైసా వంటి చిత్రాలు భారీ
చిత్రాలు ఆర్ ఆర్ మూవీ
మేకర్స్ సమర్పణలో ఈ సంవత్సరం విడుదలకు
సిద్ధం అవుతున్నాయి.







0 comments:
Post a Comment