గుంటూరు/ఒంగోలు: దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయులుగా
ఉండబట్టే తాము రాజకీయాల్లో వెనుకబడ్డామని
గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం ఆవేదన
వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై తనకు ఏమాత్రం కోరిక
లేదని స్పష్టం చేశారు. తన తోటి పార్లమెంటు
సభ్యుడు కావూరి సాంబశివ రావుకు మంత్రి పదవి ఇస్తే తనకు
ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పారు. గాంధీ
కుటుంబానికి విధేయులుగా ఉన్న తమ సామాజిక
వర్గాన్ని పక్కన పెట్టడం ఎంతో
బాధించిందన్నారు.
మరోవైపు
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి వట్టి వసంత్ కుమార్కు ఆదివారం చేదు
అనుభవం ఎదురయింది. జిల్లాలోని బుట్టాయగూడంలో పార్టీ నేత కరాటం రాంబాబును
బుజ్జగించేందుకు ఆయన వెళ్లారు. ఈ
సమయంలో కరాటం వర్గం నేతలు
వట్టిని ఘెరావ్ చేశారు. కాంగ్రెసు పార్టీకి, పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. వట్టిని అడ్డుకొని ముందుకు వెళ్లేందుకు అసలు అనుమతించలేదు.
ఈ సందర్భంగా వట్టి మాట్లాడుతూ... కార్యకర్తల
అభిప్రాయాలను తాను పార్టీ అధిష్టానానికి
చెబుతానని అన్నారు. అభ్యర్థులను సూచించే వరకే తమ బాధ్యత
ఉంటుందన్నారు. నిర్ణయించే అధికారం తమకు లేదని చెప్పారు.
కాగా
గుంటూరు జిల్లా ఈవూరు మండలం ఇనిమెళ్ల
గ్రామంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం
ఊరేగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చల్లిన గులాం కాంగ్రెసు వర్గీయుడిపై
పడింది. దీంతో ఘర్ణణ మొదలైంది.
ఇరువర్గాలకు
చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దాడుల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఘటనా
స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.







0 comments:
Post a Comment