న్యూఢిల్లీ:
తెలుగుదేశం ఓ కుటుంబ పార్టీ
అని, ఆ పార్టీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు టిక్కెట్ల విషయంలో కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేయడమా
అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం
న్యూఢిల్లీలో అన్నారు. టిక్కెట్ల ఖరారు గురించి చంద్రబాబు
విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఇప్పటి
వరకు అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితి
వారిదే అన్నారు.
రెండు
మూడు రోజుల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకొని
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి
చేస్తామని బొత్స చెప్పారు. ఈ
అంశంపై పార్టీ నేతలతో సాయంత్రం మరోసారి భేటీ అవుతామని చెప్పారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మా
సంప్రదాయాలు మేం పాటిస్తున్నామని ఆయన
చెప్పారు. చంద్రబాబు తమపై విమర్శలు చేయటం
మానుకోవాలన్నారు. ఇది సిగ్గుచేటు విషయమన్నారు.
కాగా సోనియా గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
బొత్స సాయంత్రం భేటీ కానున్నారు.
కాగా
ఇప్పటి వరకు అధిష్టానం పలు
నియోజకవర్గాల అభ్యర్థులకు ఆమోదముద్ర వేసిందని తెలుస్తోంది. వారిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధిష్టానం ఆమోదముద్ర
వేసినట్లుగా భావిస్తున్నది ఇవే.. నర్సన్నపేట - ధర్మాన
రాందాస్, పాయకరావుపేట - గంటెల సుమన, రామచంద్రపురం
- తోట త్రిమూర్తులు, నర్సాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రత్తిపాడు - సుధాకర్ బాబు, ఒంగోలు - మాగుంట
పార్వతమ్మ, ఉదయగిరి - కంభం విజయ రామిరెడ్డి,
తిరుపతి - వెంకట రమణ, ఆళ్లగడ్డ
- గంగుల ప్రతాప్ రెడ్డి, ఎమ్మిగనూరు - రుద్ర గౌడ్, అనంతపురం
- రషీద్ అహ్మద్ లేదా ఆయన భార్య,
రాయదుర్గం - పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, రాజంపేట - మేడా మల్లికార్జున్ రెడ్డి,
రాయచోటి - రాంప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు - ఈశ్వరయ్యల పేర్లను ఖరారు చేశారు.
నెల్లూరు
పార్లమెంటు స్థానానికి సుబ్బిరామిరెడ్డిని ఎంపిక చేసిన విషయం
తెలిసిందే. పోలవరం, మాచర్ల, పరకాల నియోజకవర్గాల పైనే
తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది.
పరకాల నుండి గండ్ర జ్యోతి,
సమ్మిరెడ్డిలు పోటీ పడుతున్నారు. కాగా
పైన సూచించిన అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినప్పటికీ చివరి
నిమిషంలో వాటిల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశముందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment