అంతా
కొత్త తారలతో వి.ఆనందప్రసాద్ నిర్మాణతలో
తేజ రూపొందించిన చిత్రం ‘నీకు నాకు డాష్
డాష్’.
ఈ చిత్రం కథ ప్రకారం మద్యం
సిండికేట్లో పనిచేసే హీరో
హీరోయిన్లు ఓ తప్పు చేస్తారు.
దానివల్ల సమస్యలో చిక్కుకొని, దాన్నుంచి బయటపడ్డం కోసం మరో తప్పు
చేస్తారు. ఆ తర్వాత బలవంతంగా
ఇంకో పెద్ద తప్పు చేస్తారు.
దాంతో మద్యం సిండికేట్ మొత్తం
వాళ్ల వెంట పడుతుంది. ఈ
నేఫద్యంలో వారి ప్రేమ కథ
ఏ మలుపు తీసుకుందనేది ధ్రిల్లంగ్
గా తేజ తీర్చి దిద్దారు.
నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్
ఈ చిత్రం విడుదలైన తర్వాత 'డాష్ డాష్' తొలగించి
''నీకు నాకు''గా నిర్ణయించారు.
1. నాగేంద్రను
చంపే సన్నివేశంలో హీరోయిన్ తన చేతిని హీరో
పిరుదులపై ఉంచిన దృశ్యాన్ని తొలగించగా
అంగీకరించిన అంతే నిడివిగల వేరే
షాట్ని ఆ స్థానంలో
ఉంచారు.
2. 'హోమ్
మినిస్టర్, ఎక్సైజ్ మినిస్టర్' పదాలను తొలగించారు.
3. 'మా
వూరి డాష్గాడు..' పాటలో
''ఆ డాష్ టేస్ట్ మరిగి
డాష్ చేస్తే మీనాక్షి పందిరి మంచం విరిగిపోయింది'' అనే
వాక్యం పాటలో ఎక్కడ వున్నా
కత్తెర పాలు కావడంతో ఆ
స్థానంలో అంతే నిడివిగల ''ఆ
డాష్ టేస్ట్ మరిగి డాష్ చేస్తే
మీనాక్షి కోడిపుంజు ఇగురైపోయింది''గా వుంచడానికి అంగీకరించారు.
4. రెండవ
పాటలోని రెండవ చరణంలో పళ్లు
అమ్మే స్త్రీని సుమన్శెట్టి లొంగదీసుకునేందుకు
చేసే ప్రయత్నంగా ఉంచిన రంగుల దృశ్యాలను
తొలగించారు.
'ఆపకురా
వురికే వయసు...' గీతంలో
5). ఎ)
అటక మీద హీరో, హీరోయిన్
వ్యక్తపరిచిన అశ్లిలమైన అంశాలను తొలగించగా అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే
దృశ్యాన్ని ఉంచడానికి అంగీకరించారు.
బి) నోటిలో చాక్లెట్ వుంచుకుని హీరో, హీరోయిన్ కింద
పడుకునే దృశ్యాలను తొలగించారు. దాంతో అంతే నిడివిగల
అనుమతి పొందిన దృశ్యాలను ఆ స్థానంలో ఉంచమన్నారు.
సి) నీలిరంగు దుప్పటిలో హీరో హీరోయిన్ పొర్లాడే
దృశ్యాలు కత్తెరపాలయ్యాయి. అంతే నిడివిగల అనుమతి
పొందిన వేరే దృశ్యాలను అక్కడ
ఉంచడానికి అంగీకరించారు.
డి) శృంగార ప్రక్రియలో భాగంగా హీరోయిన్ తన ముఖం ద్వారా
చూపిన భావ ప్రకటనలను కత్తెరించడంతో
అంతే నిడివిగల వేరే దృశ్యాలను ఆ
స్థానంలో వుండనిచ్చారు.
ఇ) బాపినీడు మీద తీర్థ పడుకుని
తన సెక్స్ కోరికను తీర్చమంటూ అతడిని లేపే ప్రయత్నంలో తీర్థతో
చిత్రీకరించిన క్లీవేజ్ దృశ్యాలను తొలగించారు. ఈ స్థానంలో అనుమతి
పొందిన అంతే నిడివిగల వేరే
దృశ్యం వుంచడానికి అంగీకరించారు.
ఎఫ్)
బాపినీడుతో పాటు పడుకున్న యువతికి
సంబంధించిన క్లీవేజ్ దృశ్యాలు కత్తెర పాలయ్యాయి. వీటికి బదులు అనుమతి పొందిన
అంతే నిడివిగల దృశ్యాలను ఉంచారు.
జి) రతిక్రీడలోని ఆనందంకి సంబంధించిన కదలికల దృశ్యాలను తొలగించగా అంతే నిడివిగల వేరే
దృశ్యాలను ఉంచడానికి అంగీకరించారు.
హెచ్)
కంటి మీద ముద్దు పెట్టుకునే
దృశ్యాలను తొలగించగా అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే
దృశ్యాలను వుంచారు.
6). 'పైట
తగిలితే చాలు ఎలాంటి వాడైనా
పడాల్సిందే' డైలాగ్కి బదులు ''పైట
తగిలితే చాలు ఎలాంటి మగాడైనా
లవ్లో పడాల్సిందే'' వుంచడానికి అనుమతించారు.
7). ''మాది
ఆల్రెడీ మూసుకుని వుంది బాబూ చూస్తావా''
డైలాగ్ కత్తిరింపుకు గురైంది.
8). బాపినీడుతో
తీర్థ రతికేళిలో పాల్గొంటున్నప్పుడు వెలువడిన మైకపు మూలుగులను, ఎక్కౌంట్లు
పరిశీలిస్తున్న ఎక్కౌంటెంటేకు సంబంధించిన దృశ్యాలు తొలగించారు.
9). హీరోయిన్
రెండుసార్లు పలికిన 'డాష్ ముండా'ని
తొలగించగా అందుకు బదులుగా ''డాష్ మొహంది'' వుంచడానికి
అనుమతించారు.
10). 'దాని
సీసా పగిలిపోతుంది'ని కత్తెరించగా ఆ
స్థానంలో ''దాని తల పగిలిపోయేది''
వుంచడానికి అంగీకరించారు.
11). 'అబ్బాయిలతో
మాట్లాడితేనే కడుపు వస్తుందా' వాక్యంకి
బదులుగా ''అబ్బాయిలతో మాట్లాడితేనే ప్రాబ్లెం వస్తుందా'' వుంచడానికి అనుమతించారు.
12). ''దీని
తల్లి'' పదం కత్తెర పాలైంది.
13). ''నీ
యబ్బా, నీ యమ్మా, నీ
తల్లి, రంకు మొగుడు, ఇంతేవుంది,
మూసుకొని వెళ్లు'' సినిమాలో ఎక్కడున్నా తొలగింపుకు గురికాగా 'డాష్ చేయాల్సింది'కి
బదులుగా ''నీ మొహం డాష్
చేయాల్సిందే''ని వుంచడానికి అంగీకరించారు.
14). ''పెద్ద
కంచు'' పదాలను తొలగించారు.
15). తీర్థ
తన పైటని తొలగించే దృశ్యాలను
పైటలేకుండా నిలబడిన దృశ్యాలను తొలగించారు.
16). 'ఒన్లీ
నైట్ టైమ్లో వెళతాం'
వాక్యంలోని ''నైట్టైమ్'' కత్తిరింపుకు
గురి అయింది.
17). 'సూపర్
చెక్క దీనక్క' పదాలు కత్తెర పాలయ్యాయి.
ప్రిన్స్,
నందిత నాయకా నాయికలు. తీర్థ,
బెనర్జీ, వేణు, పరుచూరి వెంకటేశ్వరరావు
మిగతా తారాగణం. తేజ, రామస్వామి సంభాషణలు,
యశ్వంత్నాగ్ సంగీతం సమకూర్చారు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' 24 కట్స్తో 'ఎ'
సర్టిఫికెట్ని 9-4-2012న జారీ చేసింది.
2 గం.39 ని.53 సెకన్లపాటు ప్రదర్శితమయ్యే
ఈ చిత్రం 13-4-12న విడుదలైంది.
0 comments:
Post a Comment