అల్లు
అర్జున్ తాజా చిత్రం 'జులాయి'
విడుదలకు రెడీ అయిన సంగతి
తెలిసిందే. అందులోనూ అల్లు అర్జున్ తాజాగా
తమిళ దర్శకుడు రాజేష్ కి ఓ చిత్రం
చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనికితోడు సురేంద్రరెడ్డితో అనుకున్న ప్రాజెక్టు ఏమైంది అనేది తర్వాత వార్తలు
రాలేదు. ఈ నేఫధ్యంలో అతని
తదుపరి చిత్రం ఏమిటి.. ఏ డైరక్టర్ తో
చేయనున్నాడు అన్న విషయం అందరిలో
ఆసక్తిని రేపుతున్నది. మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంతకీ
అల్లు అర్జున్ ఎవరితో చేయబోతున్నాడు అంటే... నాగచైతన్యతో జోష్ అనే డిజాస్టర్
చిత్రం ఇచ్చిన వాసు వర్మతో అని
విశ్వసనీయ సమాచారం. సురేంద్రరెడ్డి చెప్పిన కథ ఓకే కాకపోవటంతో
ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాసు వర్మతో మరో
చిత్రం చేయటానికి దిల్ రాజు చాలా
కాలం నుంచి బన్నీ డేట్స్
కోసం ఎదురుచూస్తున్నారు. పరుగు చిత్రం తర్వాత
దిల్ రాజు బ్యానర్ లో
బన్ని ఓకే చేస్తున్న చిత్రం
ఇదే. ఈ చిత్రానికి టైటిల్
లవర్ అని చెప్తున్నారు.
ఇక జులాయి విషయానికి వస్తే... అల్లు అర్జున్ హీరోగా
నటించిన చిత్రం 'జులాయి'. ఇలియానా హీరోయిన్... త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జులై
13న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్
శ్రీనివాస్ తొలిసారి కలిసి పనిచేయడంతో ఈ
సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. ఈ సినిమాకు ఇంత
క్రేజ్ రావడానికి టైటిల్ కూడా ఓ కారణం.
ఇటీవలే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో
త్రివిక్రమ్ డైలాగ్స్ టపాసుల్లా పేలుతున్నాయని మెగా అభిమానులు ఆనందం
వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించిన ఈ చిత్రం పాటలు
ఇటీవలే విడుదలయ్యాయి. పాటల ప్లాటినమ్ డిస్క్
వేడుక జూలై 8న ఘనంగా
నిర్వహించనున్నట్లు నిర్మాత ఎన్.రాధాకృష్ణ చెప్పారు.
దేవిశ్రీప్రసాద్
ఎంత అద్భుతంగా పాటలు అందించారో అంతకంటే
గొప్పగా నేపథ్య సంగీతాన్ని చేకూర్చారు. ఈ సినిమా సాధించబోయే
విజయంలో దేవిశ్రీ సంగీతం కూడా ప్రధానపాత్ర పోషించనుంది.
తివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
అల్లు అర్జున్, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ సీన్లు యూత్ని విశేషంగా
అలరిస్తాయి అని నిర్మాత చెప్పారు.
దర్శకుడిగా త్రివిక్రమ్ ఇమేజ్ని ఆకాశమంత
ఎత్తుకు తీసుకెళ్లే సినిమా ఇదని, ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ జరుగుతోందని, జూలై 13న చిత్రాన్ని విడుదల
చేయనున్నామని సమర్పకుడు డీవీవీ దానయ్య తెలిపారు. ఈ చిత్రానికి ఆర్ట్:
రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక
అండ్ హాసిని క్రియేషన్స్.
0 comments:
Post a Comment