మనం తినే ఆహారాలలో కొవ్వు
తక్కవ ఉండాలి. రుచి అధికంగా వుండాలి.
ఈ రెండూ కుదరటం అంటే
కష్టమే. కొవ్వు అధికంగా వుండే, నూనెలు, నెయ్యి, వెన్న వంటివి వేస్తేనే
మంచి రుచి వస్తుంది. కాని
అవి ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి.
చాలాకాలంనుండి పోషకాహార నిపుణులు , కొవ్వు కల పదార్ధాలు తినరాదని,
సహజ ఆహారాలను తింటూ ఆరోగ్యంగా వుండమని
చెపుతున్నారు. అయితే, వీటిని తింటున్నప్పటికి మనం వండుకునే ఆహారాలు
రుచికరంగా కూడా చేసుకోవాలని భావిస్తాం.
అందుకుగాను కొవ్వులు తక్కువగా వుంటూ రుచికరంగా వుండే
ఆహారాలను కొన్నింటిని పరిశీలించండి.
మీ మెనులో చేర్చదగిన ఈ క్రింది సహజ
ఆహారాలను తప్పక మీకిష్టమైనవిగా తీసుకోండి.
టోఫు
- టోఫు తయారీలో రుచి లేని కాటేజ్
ఛీజ్ వేయనవసరంలేదు. టోఫు కనుక చైనీయుల
పద్ధతిలో సాస్, మరియు మసాలాలు
వేసి ఎంతో రుచికరమైన వంటకంగా
చేయవచ్చు. టోఫులో కొవ్వు తక్కువ, పీచు, ప్రొటీన్లు, కాల్షియం,
కార్బోహైడ్రేట్లు అధికం. ఎనర్జీ పెంచుతుంది. దీనిని పెరుగుతో కలిపి ఉదయంవేళ తింటే,
రోజంతా చురుకుగా వుంటుంది.
గోధుమ
పస్తా - ఎంతో రుచికల ఈ
ఇటాలియన్ వంటకం పస్తా. ఇది
కొవ్వుని ఇస్తుందని మానటం కన్నా గోధుమలతో
తయారు చేయండి. చాలా ఆరోగ్యం, కొవ్వు
తక్కువ. బరువెక్కుతామన్న భయం లేకుండా ఎంతైనా
తినేయవచ్చు.
గింజధాన్యాల
బిస్కట్లు - బిస్కట్లు లేకుండా...కాఫీలు టీలు తాగలేము. మరి
గింజధాన్యాల బిస్కట్లు మీకు చాలా సమయం
ఆకలిలేకుండా చేస్తాయి. నేడు మార్కెట్లలో, క్రీమ్
బిస్కట్లకంటే కూడా గింజధాన్యాల బిస్కట్లు
విరివిగా దొరుకుతున్నాయి. వీటిని తిని మంచి పోషణ
కలిగి వుండండి.
ఉడికించిన
బంగాళదుంపలు - బంగాళదుంప వేపుడు అంటే అందరికి ఇష్టమే.
వేపుడు హాని కలిగిస్తుంది. కనుక
ఉడికించండి. కట్లెట్, క్యూబ్, మొదలైనవి తయారు చేసి సైడ్
డిష్ గా కూడా తినవచ్చు.
నూనెలో వేయించేకంటే, ఉడికించి తినండి. బరువు తగ్గాలనుకునేవారు సాయంత్రంవేళ
స్నాక్స్ గా ఉడికించిన బంగాళ
దుంప తినవచ్చు.
బెల్లం
తో స్వీట్లు -ఏ వంటకానికైనా తీపి
కావాలనుకుంటే, షుగర్ బదులుగా బెల్లం
వాడవచ్చు. బెల్లంలో కార్బోహైడ్రేట్లు, మినరల్స్, ఐరన్ వుంటాయి. జీర్ణ
క్రియ మెరుగుపరుస్తుంది. శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. బ్లడ్ షుగర్ గురించి
ఆందోళన చెందే షుగర్ వ్యాధిగ్రస్తులు
కూడా బెల్లం స్వీట్ అపుడపుడూ తినవచ్చు.
జొన్నపొత్తులలో
తేనె - జొన్న పొత్తులు కొవ్వు
తక్కువ, పోషకాలు అధికం కలిగి వుంటాయి.
ఉదయం బ్రేక్ ఫా్ట్ గా వీటిలో
తేనె కలిపి తింటే, మీకు
కావలసిన విటమిన్లు, మినరల్స్ తేలికగా అందుతాయి. కనుక తక్కువ కొవ్వు
వుండే బ్రేక్ ఫాస్ట్ గా తేనె కలిపిన
జొన్న పొత్తులు తినండి.
కొవ్వు
అధికంగా వుండే ఆహారాలు తిని
మందులు మింగేకంటే, కొవ్వు లేని ఈ ఆహారాలను
తింటూ ఆనందించండి. చక్కని శారీరక రూపం కలిగి వుండండి.
0 comments:
Post a Comment