అల్లు అర్జున్
మొదటి నుంచి డాన్స్ లంటే ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వస్తున్నాయి. అదే క్రమంలో తన తాజా
చిత్రం 'జులాయి'కోసం కూడా కొన్ని క్లిష్టమైన స్టెప్స్ ని ఎన్నుకున్నారు. అయితే ఆ స్టెప్స్
ప్రాక్టీస్ లో అల్లు అర్జున్ వెనక భాగంకు దెబ్బ తగినట్లు తెలుస్తోంది. కొద్ది వారాలు
పాటు రెస్ట్ తీసుకున్న అల్లు అర్జున్ తిరిగి షూటింగ్ లో పాల్గొని ఆ పాటను పూర్తి చేసారు.
అయితే అదేమీ సీరియస్ కాకపోయినా నొప్పితో చేయటం కష్టమని డాక్టర్స్ ఎడ్వైజ్ చేసారని బన్ని
కి క్లోజ్ గా ఉండే నటుడు ఒకరు వెల్లడించారు.
గతంలోనూ
అల్లు అర్జున్ ఆర్య2,బద్రీనాధ్ సమయంలో
డాన్స్ చేస్తూ గాయపడ్డారు.అయితే ఆ పాటలు
మాత్రం అద్బుతమైన రెస్పాన్స్ ని సంపాదించుకున్నాయి. అలాగే బద్రీనాధ్
సమయంలో జరిగిన ఇంజ్యూరి కి అయితే ఆస్ట్రేలియా
వెళ్లి మరీ భుజానికి సర్జరీ
చేయించుకుని వచ్చారు. ఇక ఈ చిత్రంలోని
జానీ మాస్టర్ సమకూర్చిన ఓ పాట సమయంలో
ఇలా జరిగింది. ఆ పాటకు అరవై
ఐదు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టారు. తెరపై
ఆ పాట హైలెట్ గా
నిలుస్తుందని చెప్తున్నారు.
అల్లు
అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్
రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకన్న ఈ చిత్రంపై మంచి
అంచనాలు ఉన్నాయి. వచ్చేనెలలోనే ఈ చిత్రం విడుదల
చేయనున్నారు. ఈ మేరకు ఫోస్ట్
ప్రొడక్షన్ వర్క్ ని వేగవతం
చేస్తున్నట్లు గా చెప్తున్నారు. ఇక
ఈ చిత్రం ఆడియోని ఈ నెల 10 న
విడుదల చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం
అందించారు. గబ్బర్ సింగ్ తో ఊపు
మీదున్న దేవి ఈ ఆడియోని
అదరకొట్టాడని చెప్తున్నారు.
అలాగే
కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా
ఈ చిత్రానికి ‘జులాయి' పేరే సరైనది అని
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్లా దూసుకుపోతాయని, అవి
అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని
సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ''అర్జున్ శైలి నటన, నృత్యాలు
ప్రధాన ఆకర్షణ. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా
అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా ‘జులాయి' చిత్రానికి
హైలైట్గా నిలువనున్నాయి''అన్నారు
.
ఎప్పటికప్పుడు
నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా
అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు అల్లు అర్జున్. ఈ
చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
0 comments:
Post a Comment