కడప/
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై
కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, చిరంజీవి తన దాడిని కొనసాగిస్తున్నారు.
ఏ పనిలోనైనా సగం వాటా కోరే
వైయస్ జగన్ మిస్టర్ ఫిఫ్టి
పర్సెంట్ అని లగడపాటి రాజగోపాల్
వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని
తిట్టినవారిని జగన్ తన పార్టీలో
చేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. ఆయన
గురువారం కడప జిల్లాలో ప్రజాహిత
పాదయాత్ర నిర్వహించారు.
వైయస్
రాజశేఖర రెడ్డిని ఆదుకున్నవారిని జగన్, ఆయన కుటుంబ
సభ్యులు దూషిస్తున్నారని లగడపాటి అన్నారు. అవినీతి, స్వార్థం, అసత్యం లక్ష్యాంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పనిచేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసులో
ఉన్నా వైయస్ జగన్ జైలుకు
వెళ్లేవాడని ఆయన అన్నారు. నేరం
చేసినవారు ఎవరైనా దోషులుగా నిలబడాల్సిందేనని ఆయన అన్నారు.
జగన్
తప్పు చేశాడని కోర్టులు, సిబిఐ కూడా అంటున్నాయని
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. కుట్ర చేస్తున్నారనే కల్లిబొల్లి
కబుర్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మానుకోవాలని ఆయన
సూచించారు. సానుభూతి పేరుతో ప్రజలను మోసం చేయడం సాధ్యం
కాదని ఆయన అన్నారు.
ఒక వ్యక్తి అధికార దాహంతోనే ఈ ఉప ఎన్నికలు
వచ్చాయని చిరంజీవి అన్నారు. జగనే ఉప ఎన్నికలకు
కారణం అన్నారు. ఇవి సాదాసీదా ఉప
ఎన్నికలు కావని, కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని
కోరారు. ఏ సంక్షేమ పథకాలను
ప్రభుత్వం నిలిపివేసిందో తెలపాలని జగన్కు చిరంజీవి
సవాల్ విసిరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఉప ఎన్నికలలో లబ్ధి
పొందేందుకు సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని
మండిపడ్డారు.
వైయస్
జగన్పై లగడపాటి రాజగోపాల్,
చిరంజీవి, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి
కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఎడతెరిపి లేకుండా విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా
జగన్ను వదలడం లేదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కూడా
కౌంటర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా, చిరంజీవి వైయస్ జగన్ సోదరి
షర్మిలపై కూడా దూకుడు పెంచారు.
0 comments:
Post a Comment