వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనంతరం ఆయన సతీమణి వైయస్
భారతి రెడ్డి అన్ని వ్యాపారాలు చూసుకుంటున్నారు.
ఇన్నాళ్లూ జగన్ చూసుకున్న అన్ని
వ్యాపారాలను ఆమె ఒంటి చేత్తో
నడిపించనున్నారు. ఆమె తమ సాక్షి
పత్రిక, సాక్షి టివి ఛానెల్, భారతి
సిమెంట్ తదితర కంపెనీ వ్యవహారాలను
చూసుకోవాల్సి ఉంది. ఆయా కంపెనీల
కార్యాలయాలకు ఆమె నిత్యం హాజరువుతూ
యాక్టివ్ రోల్ పోషించనున్నారు.
జగన్
లేని లోటు కనిపించకుండా ఆమె
వ్యవహారాలు నడిపించనున్నారు. అయితే భారతి రెడ్డి
కేవలం జగన్ అరెస్టు తర్వాత
మాత్రమే వ్యాపార లావాదేవీలు నిర్వహించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ కొన్నాళ్లకు కాంగ్రెసు
పార్టీని వీడి బయటకు వచ్చారు.
ఆయన నిత్యం ఓదార్పు యాత్రలు, దీక్షలు తదితర రాజకీయ కార్యక్రమాలలో
బిజీ బిజీగా గడిపారు. దీంతో ఆమె గత
ఏడాదిన్నరగా కంపెనీల వ్యాపారాలు చూసుకుంటున్నారు.
అయితే
జగన్ ఉన్న కారణంగా పూర్తి
బాధ్యతలు ఆమెపై పడలేదు. కానీ
భర్త జైలుకెళ్లాక ఆమె పైనే పూర్తి
బాధ్యతలు పడ్డాయి. దీంతో ఆమె నిత్యం
సాక్షి మీడియా, భారతి సిమెంట్ కార్యాలయాలకు
చక్కెర్లు కొడుతున్నారు. కంపెనీ ప్రతినిధులతో నిత్యం టచ్లో ఉంటున్నారు.
వ్యాపారాలలో ఇంతగా బిజీగా ఉంటూనే
మరోవైపు తన ఇద్దరు కూతుళ్లను
కూడా చూసుకుంటున్నారు.
జగన్
తల్లి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్
విజయమ్మ, సోదరి షర్మిలలు తోడుగా
ఉన్నప్పటికీ వారిద్దరూ పూర్తిగా ఉప ఎన్నికల ప్రచారంలో
మునిగిపోయారు. జగన్ ప్రచార బాధ్యతలను
విజయమ్మ, షర్మిలలు నిర్వహిస్తున్నారు. దీంతో సొంత కంపెనీల
వ్యాపారాల పూర్తి బాధ్యత భారతి రెడ్డి పైనే
పడింది.
భారతి
రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్టు గ్రాడ్యుయేషన్
చేశారు. తమ కంపెనీల వ్యాపారాల్లో
తాను ప్రధానమైన పాత్ర పోషిస్తానని ఆమె
చెప్పారు. తనకు వ్యాపారాలు కొత్త
కాదని, గత ఏడాదిన్నరగా తన
భర్త(జగన్)కు బిజీగా
ఉన్నారని, దీంతో అప్పటి నుండి
తానే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని చెప్పారు.
జగన్ పైన వచ్చిన అవినీతి
ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు.
తమ కుటుంబానికి చెందిన వ్యాపారాలు అన్ని తెరిచిన పుస్తకం
వంటివని చెప్పారు.
0 comments:
Post a Comment