ఝుమ్మంది
నాదం నుంచి ఇప్పటివరకూ తాప్సీ
నటించిన తెలుగు సినిమా ఏదీ విజయం సాధించలేదు.
రీసెంట్ గా వచ్చిన 'దరువు'కూడా మార్నింగ్ షోకే
నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ
నేపధ్యంలో ఆమె మీడియాతో సినిమా
ఫెయిల్యూర్ గురించి మాట్లాడిన మాటలు 'దరువు'గురించేనా అనే
సందేహ పడుతున్నారు. సినిమా హిట్,ప్లాప్ లకు
సంభదం లేకుండా తను కష్టపడి చేసుకుపోతానంటూ
చెప్పుకొచ్చింది.
తాప్సీ
మాట్లాడుతూ.... మన స్నేహితులు నలుగురుంటే..
ఆ నలుగురి అభిరుచులు నాలుగు రకాలుగా ఉంటాయి. మరి కోట్ల మందిని
దృష్టిలో పెట్టుకొని, వారందరూ మెచ్చుకొనేలా ఓ సినిమా తీయడం
ఇంకెంత కష్టం..అంది. అలాగే ఇప్పటి
వరకూ నేను నటించిన సినిమాలన్నీ
నాకు నచ్చే చేశాను. అవి
ప్రేక్షకులకు నచ్చాయా..లేదా అనేది వేరే
విషయం. ఎందుకంటే నా గదిలో కూర్చుని
ప్రేక్షకులందరి ఆలోచనల్ని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఎక్కువ మందికి చేరువైందా..లేదా..అనే విషయాలను
పట్టించుకొంటే చాలు అని శెలవిచ్చింది.
హీరోయిన్
పాత్రలకు ప్రాధాన్యత తగ్గిన విషయం మాట్లాడుతూ..తెలుగు
సినిమాల్లో హీరోయిన్స్ పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వడం
లేదు అని అంటున్నారు. ఎక్కడైనా
ఇదే తంతు. నేను తమిళ,
హిందీ సినిమాలు చూస్తూనే ఉన్నాను. అక్కడ కూడా హీరోయిన్
కోసం గొప్ప పాత్రలు పుట్టడం
లేదు అని చెప్పుకొచ్చింది.
తాప్సీ
ప్రస్తుతం గోపీచంద్ తో మరో చిత్రం
చేస్తోంది. గోపీచంద్,తాప్సీ కాంబినేషన్ లో మొగడు చిత్రం
డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా
ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రంలో
గోపీచంద్ నిధి అన్వేషణలో పూర్తిగా
మునిగి తేలనున్నాడు. గోపీచంద్-చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్లో
వచ్చిన ‘ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం
తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర
ఇండియా ప్రై.లి. సంస్థ
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
0 comments:
Post a Comment