బాలకృష్ణ
పుట్టిన రోజు సందర్భంగా భట్టివిక్రమార్క
రీమేక్ పోస్టర్ విడుదలై అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. కానీ
ఇంతకీ భట్టి పాత్ర ఎవరు
పోషిస్తారో అనేది హాట్ టాపిక్
గా మారింది. విక్రమార్కతో పాటు పూర్తి స్ధాయి
ప్రాధాన్యత వున్న ఈ పాత్రను
ఎవరి చేత చేయిస్తే బాగుంటుందనే
విషయమై చర్చలు జరుగుతున్నాయి.
అయితే
ఓట్లు అన్నీ శ్రీకాంత్ కే
పడుతున్నట్లు సమాచారం. శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడిగా చేసిన శ్రీకాంత్ అయితేనే
కరెక్టుగా సరిపోతాడని అంటున్నారు. దాంతో శ్రీకాంత్ నే
ఈ పాత్రకు ఎంపిక చేస్తారని ఓ
టాక్. ఇది ప్రక్కన పెడితే
ఎస్వీఆర్ నటించిన మాంత్రికుడి పాత్ర కూడా కీలకమే.
దాన్ని ఎవరు చేత చేయిస్తారనేది
కూడా పెద్ద క్వచ్చిన్ గా
మారింది. మరో ప్రక్క దర్శకుడు
రాఘవేంద్రుడా ఆయన పుత్రరత్నమా అన్నది
డిస్కషన్గా మారింది.
ప్రస్తుతం
బాలకృష్ణ హీరోగా ఆనాటి సూపర్ హిట్
సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369'సీక్వెల్ తీస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్
గా అనూష్కని ఎంపిక చేసినట్లు సమాచారం.
అలాగే ఈ సినిమాని సింగీతం
శ్రీనివాసరావు మరియు వినోద్ కలిసి
నిర్మించనున్నారు. కొండ కృష్ణం రాజు
ఈ సినిమాని సమర్పించనున్నారు. ఈ సంవత్సరం ఆగష్టు
నుండి ఈ సినిమా ప్రారంభం
కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే
బాలకృష్ణ గెస్ట్ గా నటించిన ఊ
కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతోంది.
ఈ చిత్రంలో మనోజ్ హీరోగా చేస్తున్నారు.
మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా
నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం,
ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ
వరం' అని అన్నారు. ఇందులోని
పాత్రలకు, గంధర్య మహల్ సెట్‌కు
వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్లో చిత్రాన్ని
విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది.
0 comments:
Post a Comment