నేను
సుప్రీమ్ హీరో అనిపించుకున్నా, మెగాస్టార్
అనిపించుకున్నా అది ఆయన పుణ్యమే.
జగదేకవీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడులాంటి సిల్వర్
జూబ్లి మూవీలు చేశాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్లో మాటీవీ నిర్వహించిన
‘సినిమా అవార్డ్స్ 2012' వేడుక వైభవంగా జరిగింది.
ఈ వేదికపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు జీవితకాల
సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి
ఇలా స్పందించారు.
అలాగే
‘‘ఇది రాఘవేంద్రరావుకి ఇచ్చిన పురస్కారం కాదు. ఫిలిం ఇండస్ట్రీకి
జరుగుతున్న పురస్కారం. ‘గంగోత్రి' టైమ్లో బన్నీతో..
‘నువ్వు అదృష్టవంతువుడివిరా.. తొలి సినిమానే ఆయన
డెరైక్షన్లో చేస్తున్నావు. నా
50వ సినిమాదాకా ఆయన డెరైక్షన్లో
చేసే అవకాశం నాకు దక్కలేదు' అని
చెప్పాను అన్నారు.
ఇక
..రామారావుగారి కెరీర్ డౌన్లోకెళుతున్న టైమ్లో ఒక్కసారి ‘అడవిరాముడు'తో కమర్షియల్గా
ఆయన స్టామినా ఏంటో రాఘవేంద్రరావుగారు తెలియజేశారు.ఆయన డెరైక్షన్లో
ఎక్కువగా సినిమాలు చేసినది రామారావుగారంటారు. ఆయనకంటే ఒక్క సినిమా ఎక్కువ
చేశాను నేను. దర్శకుడిగా నిరంతరం
సాగే జీవనది ఆయన. ఇప్పుడు భక్తిరసంవైపు
మళ్లారు. కానీ ఆయనకు పేరు
తెచ్చిపెట్టినటువంటి రక్తిరసాన్ని మాత్రం వదులుకోకూడదని కోరుకుంటున్నాను'' అని చిరంజీవి చెప్పారు.
కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘‘నాకు రాఘవేంద్రరావు అంటే
ప్రొఫెషనల్గా అసూయ. కానీ
మర్యాదపూర్వకంగా కొన్ని ఎథిక్స్ పాటించాలని ఈ ఫంక్షన్కి
వచ్చాను. నేను ఆయన డెరెక్షన్లో నటించాను. ఆయన
ఎంత అంకితభావం గల దర్శకుడో అప్పుడు
నాకు తెలిసింది'' అన్నారు.
0 comments:
Post a Comment