హైదరాబాద్:
ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తిరుపతి
నియోజకర్గంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి
చేతిలో స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయారు. ఉప ఎన్నికలు జరిగిన
మిగిలిన నియోజకవర్గాలను పక్కన పెడితే తిరుపతిలో
మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెసు పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా వెంకటరమణ గెలుపుపై
నమ్మకం పెట్టుకున్నారు.
అయితే
అనూహ్యంగా వెంకటరమణ ఓటమి చవి చూశారు.
వెంకటరమణ ఓటమికి పలు కారణాలతో పాటు
చిరంజీవి రాజీనామా కూడా కారణమైందనే వాదనలు
వినిపిస్తున్నాయి. తిరుపతిలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చిరంజీవి చాలా
కష్టపడ్డారు. పలుమార్లు ప్రచారం నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల కంటే తిరుపతి పైనే
ఎక్కువ దృష్టి సారించారు. చిరంజీవి రాజీనామా ప్రభావం కాంగ్రెసు అభ్యర్థిపై పడిందని, ఆ అంశమే లేకుంటే
విభేదాలు ఉన్నప్పటికీ స్వల్ప మెజార్టీతోనైనా వెంకటరమణ గట్టెక్కే వారని అంటున్నారు.
తిరుపతి
మినహా మిగిలిన నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు చిరంజీవి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేశారు. ఒక వ్యక్తి స్వార్థం
వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని
చిరు పలుమార్లు తన ప్రచారంలో చెప్పారు.
చిరు వ్యాఖ్యలపై స్థానికంగా వ్యతిరేకిత వచ్చిందని అంటున్నారు. పదిహేడు నియోజకవర్గాలలో జగన్ స్వార్థం వల్ల
ఉప ఎన్నికలు వస్తే తిరుపతి ఉప
ఎన్నిక ఎవరి స్వార్థం కోసం
వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
రాజ్యసభ
పదవి కోసం చిరంజీవి ఎమ్మెల్యే
పదవికి రాజీనామా చేశాడని, అలాంటప్పుడు అది ఆయన స్వార్థం
కాదా అనే ప్రశ్న చాలామంది
ఓటర్లలో తలెత్తిందని అంటున్నారు. అలాంటప్పుడు జగన్ తన స్వార్థం
కోసం ఉప ఎన్నికలు తీసుకు
వచ్చాడనే చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం లేదనే అభిప్రాయానికి
చాలామంది వచ్చారని చెబుతున్నారు.
0 comments:
Post a Comment