కడప:
వైయస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుందని తెలిసి ఉంటే ప్రాణాలు అడ్డం
పెట్టయినా ఆపి ఉండేవాడినని ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రమాదం జరుగుతుందని తెలిసే అప్పుడు స్పీకర్గా ఉన్న కిరణ్
కుమార్ రెడ్డి వైయస్తో పాటు
వెళ్లలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కూతురు
షర్మిల ఆరోపించిన విషయం తెలిసిందే. విజయమ్మ
ఆరోపణకు ఆయన ఆ విధంగా
అన్నారు. ఆయన శనివారం కడప
జిల్లా సుండుపల్లిలో రోడ్షో నిర్వహించారు.
శానససభలో
కమిటీలు ప్రకటించాల్సి ఉన్నందున తాను ఆ రోజు
వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు వెళ్లలేదని ఆయన
స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
మృతిని రాజకీయ చేయడం సరి కాదని
ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డిని
పిఎసి చైర్మన్గా వేయవద్దని వైయస్
తనకు సూచించారని, అయితే, నిబంధనల ప్రకారం ప్రకటించాలని తాను వైయస్కు
చెప్పానని ఆయన అన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని రెండున్నర ఏళ్ల తర్వాత తెరపైకి
తేవడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆయన అన్నారు. కొంత
మంది త్యాగం చేశామని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అంటూ త్యాగమంటే
లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడమేనా
అని అడిగారు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడం త్యాగమా
అని ఆయన ప్రశ్నించారు.
త్యాగమంటే
సోనియా, రాహుల్ గాంధీలదేనని కిరణ్ కుమార్ రెడ్డి,
చిరంజీవి సుండుపల్లి రోడ్షోలో అన్నారు.
అన్ని సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నామని, దానితో
పాటు రైతులకున వడ్డీలేని పంట రుణాలు, మహిళలకు
ఐదు లక్షల రూపాయల వరకు
వడ్డీలేని రుణాలు ఇస్తామని వారు చెప్పారు. అవినీతికి
వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగా ఓటేయాలని వారు ప్రజలను కోరారు.
దేవాదాయ శాఖ మంత్రి సి.
రామచంద్రయ్య, రాజంపేట శానససభ్యుడు సాయి ప్రతాప్ తదితరులు
ఈ రోడ్షోలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment