మాస్
మహరాజా రవితేజ, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో
ఇలియానా హీరోయిన్గా రూపొందుతున్న‘దేవుడు చేసిన మనుషులు' చిత్రం
ఆడియో విడుదల తేదీ ఖరారైంది. జూన్
22న హైదరాబాద్లోని శిల్ప కళా
వేదికలో ఆడియో విడుదల చేసేందుకు
సన్నాహాలు చేస్తున్నారు. రఘు కుంచె ఈచిత్రానికి
సంగీతం అందించారు.
దేవుడు
చేసిన మనుషులు చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ
వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై
ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. గతంలో పూరి జగన్నాథ్-రవితేజ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి.
ఇది వారిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఐదో సినిమా.
ఈచిత్రం
టైటిల్కు తగిన విధంగానే
సినిమా స్టోరీ ఉందని స్పష్టం అవుతోంది.
ఆ వివరాల్లోకి వెళితే...ఈ చిత్రంలో బ్రహ్మానందం,
కోవై సరళ దేవుళ్లుగా విష్ణుమూర్తి,
లక్ష్మి దేవి పాత్రల్లో కనిపిస్తారని
తెలుస్తోంది. ఒక రోజు లక్ష్మిదేవి
తెలుగు సినిమా చూడాలనికుటుంది. అయితే అది రీల్లో కాకుండా రియల్
లైఫ్లో విష్ణుమూర్తి సృష్టించిన
పాత్రలతో చూడాలనుకుంటుంది. తొలుత విష్ణుమూర్తి ఇందుకు
ఒప్పుకోక పోయినా....నారదుడు(జూనియర్ రేలంగి) కల్పించుకుని విష్ణుమూర్తిని ఒప్పిస్తాడు.
ఈ మేరకు పాత్రల రూపకల్పన
చేసిన విష్ణుమూర్తి....రవితేజను ఇండియాలో, ఇలియానాను బ్యాంకాక్లో పుట్టిస్తాడట.
కాగా...ఈ చిత్రం ఆడియోను
ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘సోనీ మ్యూజిక్' సొంతం
చేసుకుంది. ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ,
ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,
ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం : రఘు కుంచె, ఎడిటింగ్
: ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత
: బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే,
దర్శకత్వం : పూరి జగన్నాథ్.
0 comments:
Post a Comment