ఇదే కథాంశంతో హలీవుడ్లో ఓ సినిమా
తీస్తే.. అందరూ మెచ్చుకొన్నారు. ఇక్కడ
ఇన్ని అనుమానాలు రావడం ఆశ్చర్యంగా ఉంది
అంటున్నారు హీరో రామ్ . కరుణాకరన్
దర్శకత్వంలో రామ్, తమన్నా జంటగా
స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయోత్సవ
సభను ఆదివారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ
సందర్భంగా రామ్ పై విధంగా
స్పందించారు.
అలాగే
...'మొదట్లో సినిమా గురించి కాస్త వ్యతిరేక ప్రచారం
జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడిప్పుడే
మా సినిమా ప్రేక్షకులకు చేరువవుతోంది. బతికున్నప్పుడు మనిషి ఆత్మ బయటకు
రావడం ఏమిటి? అని చాలామంది సందేహాలు
వ్యక్తం చేశారు. కానీ హాలీవుడ్ లో
తీసినప్పుడు రానీ అనుమానాలు ఇక్కడ
రావటం ఆశ్చర్యంగా ఉంది. అయినా తెలుగులో
వస్తున్న సినిమాలన్నీ ఇంచుమించు ఒకే తరహాలో ఉంటున్నాయి.
వీటి మధ్య మా సినిమా
కాస్త విభిన్నంగా ఉండాలనుకొన్నాం. ఆ ఆలోచనల నుంచి
పుట్టిందే 'ఎందుకంటే ప్రేమంట అన్నారు రామ్.
దర్శకుడు
కరుణాకరన్ మాట్లాడుతూ...డార్లింగ్ తరవాత మరో విభిన్నమైన
స్క్రీన్ప్లేతో అల్లుకొన్న కథ ఇది. ప్రేమకథని
కొత్త కోణంలో ఆవిష్కరించిన విధానం యువ ప్రేక్షకులకు బాగా
నచ్చింది . విభిన్నమైన కథనంతో ‘డార్లింగ్' చిత్రం తీశాను. తాను నిర్మించబోయే సినిమాకు
అంతకంటే గొప్ప స్క్రీన్ప్లే
ఉండాలని అడిగారు నిర్మాత స్రవంతి రవికిషోర్. ఆయన కోసమే ఎంతో
కష్టపడి ఈ కథ తయారు
చేసుకున్నాను. ఇదొక కొత్త తరహా
ప్రేమకథ. నా ప్రయత్నాన్ని సఫలం
చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి కొత్త కథలను ప్రొత్సహిస్తే...
మరిన్ని మంచి కథలు వచ్చే
అవకాశం ఉంటుంది అన్నారు.
''మొదటి
పది నిమిషాలూ కథకు కీలకం. దాన్ని
ఆధారంగా చేసుకొనే మిగతా కథ అల్లుకొన్నాం.
ఈ సినిమా మొదటి పది నిమిషాలు
మిస్ అయిన వారికి కథ,
కథనాల విషయంలో రకరకాల డౌట్స్ ఉత్పన్నమవుతాయి. అందుకే ఎక్కడా మిస్ అవ్వకుండా సినిమా
చూడాలి. అలా చూసిన ప్రేక్షకులకు
తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది.
ప్రస్తుతం సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
కేవలం ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసిన సమావేశం ఇది''
అని స్రవంతి రవికిషోర్ తెలిపారు.
0 comments:
Post a Comment