సెక్స్
రాకెట్ కేసులో పట్టుబడిన వర్ధమాన నటి తారా చౌదరి
ఆ పార్లమెంటు సభ్యుడిపై కత్తి కట్టినట్లే ఉన్నారు.
తనతో సంబంధాలు లేవని చెబుతున్న ఎంపిపై
ఆమె విరుచుకుపడ్డారు. ఆ ఎంపి వ్యవహారాన్ని
బయటపెడతానని ఆమె అన్నారు. తారా
చౌదరి ఆదివారం వివిధ మీడియా సంస్థలతో
విడివిడిగా మాట్లాడారు. సిఐడి అధికారులు తనకు
రక్షణ కల్పిస్తే పెద్దల గుట్టంతా విప్పుతానని ఆమె అంటున్నారు.
2008లో
జరిగిన ఓ ఫంక్షన్లో
ఒక ఎంపీ, కొందరు పోలీసులు
అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారని, దానికి సంబంధించిన ఫొటోలన్నీ నా దగ్గర ఉన్నాయని,
వాళ్లు నాకు అసభ్యకరమైన ఎస్ఎంఎస్లు పంపేవారని, అర్ధరాత్రి
నా ఇంటికొచ్చి తలుపు కొట్టేవారని, తలుపు
తీయకపోతే ఏమే.... అంటూ చెప్పలేని బూతులన్నీ
తిట్టేవారని, వాళ్లు చేసిన వాటన్నింటికీ సాక్ష్యాలున్నాయని
ఆమె వివరించారు.
పెద్దలు
తన ఇంటికొచ్చి వాళ్లు అమ్మాయిలను తెచ్చుకుని తాగి తందనాలాడేవారని, ఒక
ఎంపీ తనతో సంబంధం లేదని
చెప్పాడట అని, సంబంధం లేకపోతే
ఆయన ఇంటి నుంచి, ఆఫీసు
నుంచి, గెస్ట్హౌస్ నుంచి, ఆయన
మనుషుల నుంచి, ఆయన తమ్ముడి సెల్
నుంచి, ఆయన సెల్ నుంచి
అన్నేసి గంటలు నాతో ఎలా
మాట్లాడారని ఆమె అన్నారు.
ఏ డేట్ నుంచి ఏ
డేట్ వరకు తనకు కాల్
చేశారో.. తర్వాత ఎందుకు డ్రాప్ అయ్యారో.. తనను చంపుతానని ఎందుకు
బెదిరించారో.. వీటన్నింటికీ సంబంధించిన సాక్ష్యాలు బయట పెట్టడానికి తాను
సిద్ధంగా ఉన్నట్లు తారా చౌదరి తెలిపారు.
పోలీసులు తనను కస్టడీకి తీసుకెళ్లి
తన చీర లాగి అసభ్యకరంగా
తనను ఫొటోలు తీశారని, వాళ్ల దుర్మార్గాలన్నీ తాను
బయటపెడితే, పెద్దమనుషుల పేర్లు బయటపెడితే కస్టడీలో తనను అసభ్యంగా తీసిన
ఫొటోలు నెట్లో పెడతామని
బెదిరించారని ఆమె ఆరోపించారు.
0 comments:
Post a Comment