అప్పట్లో
మోహన్ బాబు హీరోగా వచ్చిన
సూపర్ హిట్ మూవీ ‘అసెంబ్లీ
రౌడీ' చిత్రం రీమేక్ ద్వారా మంచు విష్ణు ప్రేక్షకుల
ముందుకు రావడానికి ట్రై చేస్తున్న సంగతి
తెలిసిందే. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం
ఈ చిత్రంలో విష్ణు పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పోలి ఉంటుందని, ప్రస్తుతం
రాజకీయాల ప్రస్తావిస్తూ ఈ చిత్రం సాగుతుందని
తెలుస్తోంది.
విష్ణు
జగన్ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణ
ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం
స్టేట్లో మంచి జోరు
మీదన ఉన్న నాయకుడు జగన్.
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీ కొంటూ ఓ
వైపు సక్సెస్ ఫుల్గా పార్టీ
నడిపిస్తూ...మరో వైపు అక్రమ
ఆస్తుల కేసులో జైలు ఊచలు లెక్క
పెడుతున్నాడు. జగన్ జైల్లో ఉన్నప్పటికీ
ప్రజల ఫాలోయింగ్ పెరిగిందే తప్ప తరగలేదు.
ఈ నేపథ్యంలో జగన్ అంశాన్ని తన
సినిమాలో ఫోకస్ చేయడం ద్వారా
సినిమాపై అంచనాలు పెరుగుతాయని, ప్లాపుల బాటలో ఉన్న తనకు
హిట్ దక్కే అవకాశం ఉందని,
జగన్ను అభిమానుస్తున్న వాళ్లంతా
వచ్చి సినిమా చూసినా సినిమా హిట్టయిపోతుందనే ఆలోచనలో ఉన్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి
పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక
హీరోయిన్ గా తాప్సీ ని
ఎంపిక చేయనున్నారని సమాచారం.
ఆ మధ్య వరుస ప్లాపుల
తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న
విష్ణు త్వరలో ‘దేనికైనా రెడీ' చిత్రం ద్వారా
ప్రక్షకుల ముందుకు రాబోతున్నాడు. జి. నాగేశ్వరరెడ్డి ఈ
చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హన్సిక
హీరోయిన్గా ఎంపికైంది. ఈ
చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మీ నిర్మిస్తారు.
కోన వెంకట్ కథను అందిస్తున్న ఈ
చిత్రాన్ని యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా నాగేశ్వర
రెడ్డి తెరకెక్కించనున్నాడు.
0 comments:
Post a Comment