తను బ్రతికేవాడు కూడా ప్రేమలో పడితే...
ఆ అమ్మాయికోసమే బ్రతకాలనుకుంటాడు. ఎందుకంటే... అదే ప్రేమంట అనే
స్టోరీలైన్ ని బేస్ చేసుకుని
రూపొందిన 'ఎందుకంటే ప్రేమంట'చిత్రం ఈ రోజు విడుదల
అవుతోంది. ప్రేమ కథల స్పెషలిస్టు
కరుణాకరన్ రూపొందించిన ఈ చిత్రం ఓ
క్యూట్ లవ్ స్టోరీగా అభివర్ణిస్తున్నారు.
దర్సుకుడు
కరుణాకరన్ మాట్లాడుతూ...'ఎందుకంటే ప్రేమంట' ఎందుకు చూడాలంటే ...ఇది అందరికీ నచ్చే
ప్రేమకథ కాబట్టి. యువ జంట మధ్య
సున్నితమైన భావోద్వేగాలతో ఈ కథ నడుస్తుంది.
ఈ కథ ఇలా ఎందుకు
జరిగింది? అని ప్రశ్నించుకొంటే అప్పుడు
తెలుస్తుంది... ఎందుకంటే ప్రేమంట అని! విశ్రాంతికి ముందు
ప్రేక్షకులకు ఓ తీయని షాక్
ఇస్తాం అన్నారు.
రామ్
మాట్లాడుతూ... నా ‘కందిరీగ' వచ్చి
ఏడాదైంది. అంటే ఏడాది తర్వాత
వచ్చిన సినిమా ఇది. ఫలితం కోసం
ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. తొలి సినిమా చేసినప్పుడు
కూడా ఇంత టెన్షన్ పడలేదు.
నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా
ఇది. ‘రెడీ'లో తమన్నా
ఓ చిన్న పాత్ర చేసింది.
అప్పట్నుంచీ తను హీరోయిన్గా
కరుణాకరన్ దర్శకత్వంలో ఓ క్యూట్ లవ్స్టోరీ చేయాలని కోరిక. ఈ సినిమాతో ఆ
కోరిక తీరిపోయింది. ఈ సినిమా షూటింగ్
కొంత భాగం స్విట్జర్లాండ్లో
చేశాం. అక్కడ షూటింగ్ జరిపిన
రోజులు జీవితంలో మరిచిపోలేను. ఎంతో ఎంజాయ్ చేస్తూ
చేసిన సినిమా ఇది అన్నారు.
రవికిషోర్
మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ
క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని
వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్
ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి
పెరిగాడు. తమిళ భాషపై మంచి
పట్టు ఉంది. ఇక తమన్నా
అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ
ప్రేమ కథ అన్ని భాషలవారికీ
నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
బ్యానర్:
శ్రీ స్రవంతి మూవీస్
నటీనటులు:
రామ్, తమన్నా,రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్శెట్టి తదితరులు
మాటలు:
కోన వెంకట్
పాటలు:
రామజోగయ్య శాస్ర్తి, శ్రీమణి
సంగీతం:
జి.వి.ప్రకాష్కుమార్
కెమెరా:
ఐ.ఆండ్రూ
ఎడిటింగ్:
కోటగిరి వెంకటేశ్వరరావు
ఫైట్స్:
పీటర్ హెయిన్స్
సమర్పణ:
పి.కృష్ణచైతన్య.
నిర్మాత:
పి.రవికిషోర్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.
0 comments:
Post a Comment