అనంతపురం:
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం
అనంతపురం జిల్లా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జి.దీపక్ రెడ్డి
ఆస్తులు రూ.ఆరువేల కోట్లు.
పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న
విషయం తెలిసిందే. ఉప ఎన్నికల బరిలో
నిలిచిన అందరి అభ్యర్థులలోకెల్లా దీపక్
రెడ్డియే అత్యంత ధనవంతుడు(అఫిడవిట్ ప్రకారం). అయితే ఇందులో ఎక్కువ
మొత్తం ఆస్తులు వివాదంలో ఉన్నాయి. దీపక్ రెడ్డి వయస్సు
39 ఏళ్లు. ఇతను బిజినెస్ మేనేజ్మెంట్ గ్రాడ్యూయేట్.
ఇతని
పైన గతంలో పోలీసు కేసులు
నమోదయ్యాయి. పదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్
ఇతనిపై న్యాయ విచారణకు అనుమతివ్వగా
హైకోర్టు దానిపై స్టే విధించింది. దీపక్
రెడ్డి గ్రేట్ ఇండియన్ మైనింగ్, గ్రేట్ ఇండియా రాక్ మినరల్స్ యజమాని.
కడప జిల్లా సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి
దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రతాప్ రెడ్డికి
అల్లుడు. అయితే ఆశ్చర్యంగా దీపక్
రెడ్డి సంవత్సర ఆదాయం రూ.3.27 లక్షలు
కాగా ఇతని భార్య ఆదాయం
రూ.1.98 లక్షలు. కాగా ఇవి 2009-2010 సంవత్సరానికి
సంబంధించినవి.
ఎన్నికల
కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లోని వివరాల ప్రకారం...
దీపక్ రెడ్డి జంట చరాస్తుల విలువ
రూ.6.35 కోట్లు, చరాస్తుల విలువ రూ.21 కోట్లు.
వీటిని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూపించారు.
దీపక్ రెడ్డి గురించి అంతకుముందు తమకు పెద్దగా తెలియదని,
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
రాయదుర్గం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతనే తెలిసిందని జిల్లాకు చెందిన పార్టీ నేత ఒకరు అన్నారట.
రాయదుర్గం
నుండి పార్టీకి చెందిన స్థానిక నేతలు ఎవరూ పోటీ
చేసేందుకు ముందుకు రాకపోవడం వల్లనే దీపక్ రెడ్డికి టిక్కెట్
ఇచ్చారని అంటున్నారు. తనకు సంబంధించిన రిజిస్టర్
కాని ఆస్తులను గురించి ప్రత్యేకంగా వివరాలు అందిస్తానని దీపక్ రెడ్డి ఎన్నికల
సంఘానికి అఫిడవిట్ దాఖలు చేసే ముందు
విజ్ఞప్తి చేశారట.
0 comments:
Post a Comment