కడప:
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
సెప్టెంబర్ 2న హెలికాప్టర్లో
చిత్తూరు జిల్లాకు పయనమైనప్పుడు, ఆయనతో పాటు ప్రస్తుత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కూడా తన సొంత జిల్లా
చిత్తూరుకు వెళ్లాల్సి ఉందని, కానీ ఆయన వెళ్లలేదని,
ఎందుకు వెళ్లలేదో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం
ప్రశ్నించారు.
ఆమె తన తల్లి, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మితో కలిసి
కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల
మాట్లాడారు. తన తండ్రి తెచ్చిన
అధికారాన్ని వాడుకొని కాంగ్రెసు పెద్దలు ఆయన కుటుంబాన్నే వేధిస్తున్నారని
ఆరోపించారు. సిబిఐ విచారణ పేరుతో
తన సోదరుడు జగన్ను జైలుపాలు
చేశారని మండిపడ్డారు. సింహం బోనులో ఉన్నా
సింహమే అని వారు గుర్తెరిగేలా
ఉప ఎన్నికలల్లో తీర్పు ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారు.
నిష్పక్షపాతంగా
వ్యవహరించాల్సిన సిబిఐ సంస్థ.. జగన్
కేసులో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఆరో జు తన తండ్రి
ప్రయాణించిన హెలికాప్టర్లో తెలిసే వెళ్లలేదా
లేదా తెలియక వెళ్లలేదా చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలు, రైతుల కోసం రాజీనామా
చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు బుద్ధి చెప్పాలని సూచించారు.
రాజ్యసభ
సభ్యుడు చిరంజీవి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్
చదువుతున్నారని ఆ పార్టీ నేత
రోజా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఉప ఎన్నికల ప్రచారంలో
అన్నారు. చిరంజీవి రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. చిరంజీవి
చాల ఎక్కువగా మాట్లాడుతున్నారని, సంక్షేమ పథకాలన్ని అమలవుతున్నాయని చెబుతున్న ఆయనకు అపర సంజీవినిలాంటి
ఆరోగ్యశ్రీ నుంచి కొన్నిరోగాలను తొలగించిన
విషయం తెలియదా అని ప్రశ్నించారు.
108 వాహనాలు
డీజిల్ లేక షెడ్లలోనే ఉన్న
విషయం ఆయన తెలుసుకోవాలని సూచించారు.
జగన్కు అధికారదాహం, స్వార్థం
అంటున్న చిరంజీవిదే స్వార్థమని అన్నారు. అందుకే సామాజిక న్యాయం పేరిట స్థాపించిన ప్రజారాజ్యం
పార్టీని హోల్ సేల్గా
కాంగ్రెసు పార్టీకి అమ్మేసుకున్నారన్నారు.
0 comments:
Post a Comment