పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న
‘గబ్బర్ సింగ్' చిత్రం భారీ కలెక్షన్లతో తెలుగు
సినిమా రికార్డులన్నీ బద్దలు కొడుతూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే
ఈచిత్రంపై తాజాగా ఓ గాసిప్ వెలువడుతోంది.
గబ్బర్ సింగ్ చిత్రానికి రూ.
14 కోట్ల లాస్ రాబోతోందట. అందుకు
ఓ బలమైన కారణం కూడా
ప్రచారం జరుగుతోంది.
గబ్బర్
సింగ్ చిత్రంలో ‘అంత్యాక్షరి' సీన్ బాగా ఫేమస్
అయిన విషయం తెలిసిందే. సినిమాలో
ఈ సీన్ దాదాపు పావుగంట
పాటు సాగుతుంది. ఈ సీన్ కోసం
చాలా సినిమాల్లోని సాంగులను ఉపయోగించారు. అయితే తమ పాటలను
వాడుకున్నందుకుగాను ఆయా పాటల రచయితలు,
మ్యూజిక్ డైరెక్టర్లు కాపీరైట్ యాక్ట్ ద్వారా తమ వాటా కోరేందుకు
సిద్ధం అవుతున్నారని, 100 కోట్ల వసూలు చేసిన
ఈ చిత్రంలో 14 శాతం డిమాండ్ చేస్తున్నారని
ఓ పుకారు షికారు చేస్తోంది. అయితే నిర్మాత బండ్ల
గణేష్ మాత్రం 14 లక్షలు ముట్టజెప్పి సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడట.
పవన్
కళ్యాణ్, శృతి హాసన్ జంటగా
నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ
చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్
విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి,
వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ:
శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్స
0 comments:
Post a Comment