మీ కిష్టమైన ఆల్కహాల్ పానీయాలు తాగేటపుడు, తర్వాత వచ్చే పరిణామాలగురించి పట్టించుకోకుండా
మీరు తాగుతూనే వుంటారు. ఆనందిస్తారు. ఈ తాగుడు ప్రభావం
మరుసటి రోజు ఉదయాన్నే మీరు
నిద్ర లేచినప్పుడు కాని తెలియదు. నిద్రనుండి
లేచిన వెంటనే అధికమైన తలనొప్పి, శారీరక నొప్పులు వుంటాయి. కొన్ని సార్లు మైండ్ పనిచేయకుండా వుంటుంది.
దానినే హేంగోవర్ స్ధితిగా చెపుతారు. ఈ హేంగోవర్ నొప్పులు
గంటల తరబడి అసౌకర్యాన్నిస్తాయి. కళ్ళు తిరుగుతున్నట్లుంటుంది.
ఈ హేంగోవర్ ను వదిలించుకోవాలంటే, సాధారణంగా
చాలామంది ఏదో ఒక మాత్ర
వేస్తూనే వుంటారు. హేంగోవర్ తలనొప్పి మాత్రమే కాదు, శరీరంపై అనేక
దుష్ప్రభావాలను చూపుతుంది. వాంతి, వికారాల సెన్సేషన్ కలిగిస్తుంది. కొంతమంది ఈ సమయంలో లెమనేడ్
వంటి పానీయాలు లేదా అధికంగా నీరు
తాగటం వంటిది చేస్తారు. కాని ఈ చర్యలు
పరిస్ధితిలో త్వరగా మార్పు తీసుకురావు. ఒక సారి పోయిన
మీ ఎనర్జీని తిరిగి పొందాలంటే, శరీరానికి కొంత శ్రమ కల్పించాలి.
అందుకుగాను కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అవి పోయిన మీ
శక్తిని తిరిగి తెస్తాయి. మరి రాత్రి జరిగిన
లేట్ నైట్ పార్టీలో భారీగా
తాగిన మత్తు దిగాలంటే, కొన్ని
చిట్కాలు చూడండి.
హేంగోవర్
ను తగ్గించే వ్యాయామాలు
పరుగుపెట్టటం
- హేంగోవర్ దిగాలంటే, ఉదయం వేళ వేగంగా
పరుగుపెట్టండి. అది మీ రక్తప్రసరణ
అధికం చేస్తుంది. గుండె బాగా కొట్టుకునేలా
చేస్తుంది. పరుగులో మీరు అధిక ఆక్సిజన్
తీసుకుంటారు. అది మీ లోని
సోమరితనాన్ని పోగొట్టి, తాజాగా వుండేలా చేస్తుంది. దీనినే వ్యాయామం తర్వాతి అధిక ఆక్సిజన్ తీసుకోవటం
అని వైద్య పరిభాషలో అంటారు.
స్విమ్మింగ్
- హేంగోవర్ నివారించుకోవాలంటే, చల్లని నీటితో స్నానం చేయాలి. అయితే, మీ సోమరితనాన్ని, నొప్పులను
నివారించుకోవాలంటే, ఒక స్విమ్మింగ్ పూల్
లో వేగంగా స్విమ్మింగ్ చేయండి. చల్లని నీరు శరీరానికి తగిలితే
అది మీలోని ఎడ్రినాలిన్ పెంచుతుంది. ఎడ్రినాలినన్ పెరిగితే హేంగోవర్ వెంటనే దిగిపోతుంది. స్విమ్మింగ్ చాలామంది ఇష్టపడే అరబిక్ వ్యాయామం. అది శరీరం అధికంగా
శ్రమ పడకుండాలనే మిమ్మల్ని ఫిట్ గా వుంచుతుంది.
స్విమ్మింగ్ లో మొదట రెగ్యులర్
ఈత కొట్టండి. హాయి పొందగానే మీకిష్టమైన
రీతిలో చేయండి.
జెర్క్
ప్రెస్ లు - ఇప్పటికే మీరు
కండరాలు కలిగిన శరీరం వుంటే, మీరు
ఆ కండలను చక్కగా కాపాడుకోవాలి. హేంగోవర్ కారణంగా మీరు డంబ్ బెల్స్
కూడా ఎత్తలేరు. కాని, తలనొప్పి కారణంగా
మీరు వ్యాయామంపై శ్రద్ధ చూపలేరు. అపుడు మీరు జెర్క్
ప్రెస్ లను ఆశ్రయించాలి. ఈ
వ్యాయామం సమర్ధవంతంగా మీ హేంగోవర్ ను
తొలగిస్తుంది. ఈ వ్యాయామంలో, తిన్నగా
నించోండి. కెటిల్ బెల్ లేదా డంబ్
బెల్ మీ కుడిచేతితో పట్టుకొని
ఛాతీ వైపు లాగండి. మోకాళ్ళను
సగం వరకు వంచి కూర్చొనండి.
ఈ భంగిమలు పది నుండి 15 సెకండ్లపాటు
వుంచాలి. ఒక సారి కుడి,
మరొకసారి ఎడమ భంగిమలను ఆచరించండి.
ఈ వ్యాయామం కనుక ఒక్క పది
నిమిషాలపాటు చేస్తే, మీ తలనొప్పి, శారీరక
నొప్పులు వెంటనే తగ్గిపోయి మంచి రిలీఫ్ వుంటుంది.
సైకిలింగ్
- హేంగోవర్ వున్న ఉదయంవేళ, ఆఫీస్
లేదా మీ పని ప్రదేశాలకు
కారు లేదా బైక్ ఉపయోగించేకంటే,
సైకిలు వాడండి. ఆరోగ్యకరంగా మంచి శరీరం కలిగి
వుండాలంటే, సైకిలింగ్ చాలా మంచిది. సైకిలింగ్
ఒత్తిడిని, అధిక బరువును కూడా
తగ్గిస్తుంది.మీ ఎనర్జీ స్ధాయిలు
బాగా పెరుగుతాయి. హేంగోవర్ తగ్గటానికే కాదు, ప్రతినిత్యం మీరు
ఆరోగ్యంగా వుంటూ, వ్యాధులు దగ్గరకు రాకుండా వుండాలంటే సైకిలింగ్ వ్యాయామం బాగా పనిచేస్తుంది.
హేంగోవర్
తగ్గించుకోవాలంటే, ఈ వ్యాయామాలు చేయండి.
తగినంత నీరు లేదా ద్రవాహారాలు
తీసుకొని శరీరంలో లిక్కర్ తాగడం వలన ఏర్పడిన
డీహైడ్రేషన్ తొలగించండి.
0 comments:
Post a Comment