హైదరాబాద్:
ఉప ఎన్నికల ఫలితాలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వే నిజమయింది. మూడు
రోజుల క్రితం లగడపాటి ఉప ఎన్నికల ఫలితాలపై
తాను సర్వే చేశానని, చెబుతూ
తన అంచనాలు చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో
మెజారిటీ సీట్లు కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 12 నుంచి 16 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. వైయస్ జగన్ అన్ని
అస్త్రాలను ఈ ఎన్నికల్లో వాడడం,
తాము కాస్తా ఆలస్యంగా ఎదురుదాడికి పూనుకోవడం అందుకు కారణమని ఆయన అన్నారు.
ఆలాగే
కాంగ్రెసు పార్టీకి ఒకటి నుంచి మూడు
సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. తెలుగుదేశం
పార్టీకి సున్నా నుంచి 2 సీట్లు వస్తాయన్నారు. పరకాలలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధిస్తుందని జోస్యం
చెప్పారు. ఇక నెల్లూరు లోకసభ
స్థానం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దక్కించుకుంటుందని చెప్పారు. లగడపాటి అంచనాలు నిజమని ఫలితాలు తేల్చాయి. ఈ ఉప ఎన్నికలలో
వైయస్సార్ కాంగ్రెసు 15 స్థానాలు, కాంగ్రెసు రెండు స్థానాలు, టిఆర్ఎస్
ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది. నెల్లూరు పార్లమెంటు స్థానంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి మళ్లీ దక్కించుకున్నారు.
లగడపాటి
సర్వే అక్షరాల నిజమైంది. అయితే ఆయన చెప్పినట్లుగానే
ఫలితాలు ఉండటంతో ఇప్పుడు కొత్త చర్చ తెర
పైకి వచ్చింది. ఉప ఎన్నికలలో జగన్
పార్టీ ఘన విజయం సాధిస్తుందని
చెప్పిన లగడపాటి భవిష్యత్తులో మాత్రం ఘోరంగా దెబ్బ తింటుందని చెప్పారు.
ఈ ఉప ఎన్నికల్లో జగన్
చివరి అస్త్రం కూడా ఉపయోగించారని, ఆ
తర్వాత వాడడానికి ఏ ఆయుధాలూ ఉండవని
వైయస్ విజయమ్మను ఉద్దేశించి అన్నారు.
జగన్
అరెస్టు, విజయమ్మ ప్రచారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు సానుభూతి ఓట్లు రాలుస్తుందని ఆయన
చెప్పారు. లగడపాటి చెప్పినట్లుగానే సానుభూతి ఓట్ల ద్వారానే జగన్
పార్టీ ఘన విజయం సాధించిందనే
వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లగడపాటి
చెప్పినట్లుగా క్రమంగా సానుభూతి తగ్గి జగన్ పార్టీ
భవిష్యత్తులో ముఖ్యంగా 2014 నాటికి దెబ్బతింటుందా అనే చర్చ ప్రారంభమైంది.
చాలా
చోట్ల కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుల మధ్య హోరాహోరీ పోటీ
జరుగుతుందని, తన బలాన్ని కాంగ్రెసు
పెంచుకుందని ఆయన చెప్పారు. అది
నిజమే అన్నట్లు పలుచోట్ల కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసుకు గట్టి పోటీ ఇచ్చింది.
రెండు స్థానాలలో గెలుపు కూడా సాధించింది. కేవలం
మూడు నాలుగు స్థానాలలో మాత్రమే డిపాజిట్ కోల్పోయింది.
0 comments:
Post a Comment