స్టైలిష్
స్టార్ అల్లు అర్జున్ మరోసారి
గాయ పడ్డాడు. అతని బ్రొటన వ్రేలుకు
తీవ్ర గాయమైంది. ‘జులాయి' చిత్రం షూటింగులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు
చేసుకుంది. ఫైర్ సెటప్ ఫెయిల్
కావడంతో ఇలా జరిగినట్లు తెలుస్తుంది.
కొద్ది పాటిలో బన్నీ పెద్ద ప్రమాదం
నుంచి బయట పడ్డాడని యూనిట్
సభ్యులు అంటున్నారు. నటుడు బ్రహ్మాజీకి కూడా
స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరినప్పుడు
హీరోయిన్ ఇలియానా కూడా సంఘటన స్థలంలోనే
ఉంది. అయితే కొంత సేపటి
తర్వాత మళ్లీ యదావిధిగా షూటింగ్
ప్రారంభమైంది. రెండు మూడు రోజుల
క్రితమే బన్నీ బ్యాక్ సైడ్
గాయమైన విషయం తెలిసిందే.
త్రివిక్రమ్
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం.... జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. జీవితాన్ని
ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు.
పరుగులు తీసే వయసులో చదువు,
ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు
బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక
పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే
జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది
ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న
బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు
సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే
నిజమైంది. ఓ అందాల భామ
ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం
జరిగిందనేది సినిమా కథాంశం.
వినోదం,
యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్
నృత్యాలు అలరిస్తాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,
సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని
క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.
0 comments:
Post a Comment