హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
తనయుడు నారా లోకేష్ కుమార్
రాజకీయ ఆరంగేట్రంపై ఇటీవల జోరుగా ఊహాగానాలు
చెలరేగుతున్నాయి. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు
రావాలనే డిమాండ్ ఇటీవల పార్టీలో వినిపిస్తున్న
విషయం తెలిసిందే. కిందిస్థాయి క్యాడర్ కూడా లోకేష్ రాజకీయ
ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తోంది.
మంగళవారం లోకేష్ ఆరంగేట్రంపై చంద్రబాబు మౌనం వహించడంతో ఊహాగానాలు
మరింత జోరందున్నాయి.
గతంలో
లోకేష్ రాజకీయ ఎంట్రీపై కార్యకర్తలు, నేతలు ప్రస్తావిస్తే బాబు
ఖండించేవారు. కానీ నిన్న మాత్రం
బాబు మౌనం వహించారు. దీంతో
బాబు నుండి గ్రీన్ సిగ్నల్
వచ్చినట్టేనని భావిస్తున్నారు. బాబు కూడా లోకేష్
ఆరంగేట్రంపై ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. అయితే లోకేష్ రాజకీయాల్లోకి
వస్తే ఇచ్చే పదవిపై అప్పుడే
చర్చ ప్రారంభమైంది. ఆయనను తెలుగు యువత
అధ్యక్షుడిగా చేసే అవకాశాలు మెండుగా
ఉన్నాయని చెబుతున్నారు. ఇక ముహూర్తమే తరువాయి
అంటున్నారు.
చంద్రగిరి
నియోజకవర్గం టిడిపి కార్యకర్తలు చంద్రబాబును కలిసి లోకేష్‌కు
తెలుగు యువత అధ్యక్షుడి బాధ్యతలు
అప్పగించాలని లేఖ ఇచ్చారు. దీంతో
లోకేష్‌ను త్వరలో టిడిపి
యూత్ వింగ్ అధ్యక్షుడిగా ప్రకటించే
అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రకటన వెలువడే
అవకాశముందని అంటున్నారు. లోకేష్‌కు పార్టీలో పదవి
ఇవ్వాలనే డిమాండ్ కొత్తగా వచ్చింది కాదు.
2009లోనే
ఈ డిమాండ్ వచ్చింది. నగదు బదలీ పథక
రచన లోకేష్‌దే. అప్పటి నుండి
లోకేష్ పేరు టిడిపిలో ప్రధానంగా
తెర పైకి వచ్చారు. నాటి
నుండి అప్పుడప్పుడు లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు
రావాలని, పదవులు ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు బాబుకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అయితే మూడేళ్ల తర్వాత
తమ్ముళ్ల కోరిక నెరవేరే దిశలో
బాబు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ రాజకీయ ఆరంగేట్రానికి ముందు రాష్ట్రాన్ని కాపాడుకుందా
అనే నినాదంతో ఓ కార్యక్రమం ఆయన
ఆధ్వర్యంలో చేపట్టనున్నారని తెలుస్తోంది.
0 comments:
Post a Comment