చిత్తూరు:
తాను సరైన సమయంలో రాజకీయాలలోకి
వస్తానని ప్రముఖ సినీ నటీ రాధిక
అన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి
వారిని దర్శించుకునేందుకు రాధిక తన కుటుంబ
సభ్యులతో సోమవారం రాత్రి తిరుమలకు వచ్చారు. భర్త శరత్ కుమార్,
కుమారుడితో ఆమె తిరుపతి వచ్చారు.
ఆమె కాలి నడకన తిరుమలకు
చేరుకున్నారు. విరామ సమయంలో ఆమె
శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం
ఆలయం వెలుపల ఆమె విలేకరులతో మాట్లాడారు.
రాజకీయమంటే తెలివితేటలు ఉండటంతో పాటు తగిన సమయం
కేటాయిస్తేనే విజయం సాధించగల్గుతామని ఆమె
అభిప్రాయపడ్డారు. శరత్ కుమార్ మాట్లాడుతూ..
కూడన్‌కుళం అణు విద్యుత్
ప్రాజెక్టు ద్వారా తమిళనాడులో మరో నాలుగు నెలలో
విద్యుత్ కొరత సమస్య తీరనుందని
చెప్పారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత పాలన అద్బుతంగా ఉందని
కొనియాడారు.
కార్తి
ప్రధాన పాత్రలో వచ్చిన శకుని సినిమాలో తన
పాత్రకు మంచి పేరు వచ్చిందని
శరత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.
తెలుగు సినిమాలలో నటించడానికి అవకాశం వస్తే వదులుకోనని చెప్పారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చామని, దర్శనం బాగా జరిగిందని చెప్పారు.
కాగా
ఇటీవల రాజకీయాలలోకి ప్రముఖ నటీ నటులు వస్తున్న
విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ పార్టీలలో మాజీ
హీరోయిన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో కవిత, తెలంగాణ రాష్ట్ర
సమితిలో విజయశాంతి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో రోజా, ఉత్తర ప్రదేశ్‌లో జయప్రద, కాంగ్రెసులో
జయసుధ ప్రధానంగా ఉన్నారు.
0 comments:
Post a Comment