దాదాపు
అందరి సెలబ్రేటీల పెళ్లిళ్లలో జరుగుతున్నట్లే ఈ పెళ్లిలోనూ ఓ
చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.
రామ్చరణ్ తేజ తనను
పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వేరే వ్యక్తిని చేసుకుంటున్నాడని
మోసపోయానంటూ ఓ యువతి గొడవ
చేసింది. అయితే మీడియా మొత్తం
రామ్ చరణ్ వివాహ ఉత్సవంలో
మునిగితేలుతూండటంతో ఈ వార్తకు పెద్ద
ప్రాముఖ్యత ఇవ్వలేదు.
అసలు
గురువారంనాటి వివాహ ముహూర్తం తన
పేరుతోనే పెట్టారని, కానీ చివరకు చెర్రీ
తనను కాదని ఉపాసనను పెళ్లి
చేసుకుంటున్నాడని.. సునీత అనే యువతి
కలకలం సృష్టించింది. మూడురోజుల క్రితం చరణ్ హైదరాబాద్లోని
పెద్దమ్మ గుడిలో తన చేయిపట్టుకున్నాడని, గుర్తుగా ఒక
టవల్ ఇచ్చాడని, వివాహం చేసుకుంటానని చెప్పాడని కాసేపు హల్చల్ చేసింది.
ఆ యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనూ
శ్రీదేవి,జయప్రద వంటి స్టార్ హీరోయిన్స్
ఎందిరికో ఇలాంటి అనుభవం ఎదురైంది. కరెక్టుగా వివాహ సమయానికి ఇలా
తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి మోసం
చేసారంటూ ఎవరో ఒకరు ఇలా
వచ్చి గొడవ చేసేవారు. ఇది
ఓ రకమైన ఉన్మాదమని,ఎవరూ
కావాలని చెయ్యరని,తాము ఇష్టపడ్డ హీరో
లేదా హీరోయిన్ కి వేరే వ్యక్తితో
వివాహం జరుగుతూంటే తట్టుకోలేక తమకు తాము తెలియని
స్ధితిలో ఇలా బిహేవ్ చేస్తూంటారని,ఇది తాత్కాలకమని మానసిక
శాస్త్రవేత్తలు చెపుతూంటారు.
ఇక ఈ రోజు తన
కుమారుడు వివాహ వేడుకల్లో భాగంగా
మెగాస్టార్ తన 'మెగా'భిమానులకు
విందు ఇస్తున్నారు. వివాహం జరిగిన వ్యవసాయ క్షేత్రంలోనే శుక్రవారం విందు ఏర్పాట్లు చేశారు.
కొత్త దంపతులతో పాటు, మెగాస్టార్ కుటుంబసభ్యులు
కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 10 గంటల నుంచి విందు
జరగనున్నది. ఈ సందర్భంగా అభిమానులను
అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అయితే, ఈ వేడుక కోసం
అభిమానులకు పాసులు జారీ చేశారు. ఆ
పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. సుమారు 5 వేల మంది ఈ
విందుకు వస్తారని అంచనా.
0 comments:
Post a Comment