నిన్న(గురువారం)జరిగిన రామ్ చరణ్ వివాహ
వేడుకలలో రేణూ దేశాయ్ చర్చనీయాంశమైంది.
ఆమె కనపడలేదు. పవన్కళ్యాణ్ భార్య
రేణూదేశాయ్ ఈ పెళ్లి వేడుకలో
ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. తన బావగారు చిరంజీవి
కుమారుడు పెళ్లికి రాకపోవటం అందిరనీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఆమె సిటిలో లేరా..లేక ఏదన్నా ఆర్జెంట్
పని ఉండి రాలేదా,లేక
మరేదన్నా వ్యక్తి గత కారణాలతో రాలేకపోయారా
అని చాలా మంది చర్చించుకోవటం
మొదలైంది.
ప్రముఖ
సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి కుమారుడు హీరో రాంచరణ్ తేజ,
ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్రెడ్డి
మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి గురువారం ఉదయం హైదరాబాద్ శివారు
ప్రాంతమైన మొయినాబాద్లోని ఫామ్‌హౌస్
లో ఘనంగా జరిగింది. ఈ
వివాహానికి సినీ ప్రముఖులు బిగ్బీ అమితాబ్ బచ్చన్,
సూపర్స్టార్ రజనీకాంత్, డి.రామానాయుడు, కె.రాఘవేంద్రరావు, మోహన్బాబు దంపతులు
వచ్చారు.
అలాగే
వెంకటేష్, జమున, శ్రీదేవి, బోనీకపూర్,
మురళీమోహన్, పరుచూరి బ్రదర్స్, శత్రఘ్నసిన్హా, రాధిక, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, అంబరీష్, సుమలత, రానా, శ్రీయ, కోడి
రామకృష్ణ, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, ఎస్వీ కృష్ణారెడ్డి, వీవీ
వినాయక్, శ్రీనువైట్ల, జయంత్ సి.పరాన్జీ,
బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీ, శ్రీకాంత్ దంపతులు,
సి.అశ్వనీదత్, ఎం.శ్యామ్ప్రసాద్రెడ్డి, కె.అచ్చిరెడ్డి, దిల్రాజు, బీవీఎస్ఎన్
ప్రసాద్, బూరుగుపల్లి శివరామకృష్ణ, కైకాల సత్యనారాయణ, కోట
శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు వచ్చి తమ ఆశ్వీవచనాలను
అందచేసారు.
గురువారం
రాత్రి హైటెక్స్లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్
కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ ఘనంగా
జరిగింది. రిసెస్షన్కు స్పీకర్ నాదెండ్ల
మనోహర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ, పీసీసీ
చీఫ్ బొత్స సత్యనారాయణ దంపతులు,
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ నటులు నాగార్జున
దంపతులు, మహేష్బాబు దంపతులు,
ప్రభాస్, పూరి జగన్నాథ్ దంపతులు,
జయప్రద, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు
హాజరయ్యారు.
0 comments:
Post a Comment