సొంతంగా జీవీ మూవీస్ అనే బేనర్‌ను నెలకొల్సిన జీవీ సుధాకర్ ఈ బేనర్‌పై తొలిసారిగా 'రెడ్డిగారి మనవడు' అనే సినిమాని నిర్మించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మధ్య జీవీ ఈ సినిమా స్టోరీ గురించి కూడా వెల్లడించారు.
‘టైటిల్
ప్రకారం రాయలసీమకు చెందిన ఓ పవర్‌ఫుల్
రెడ్డిగారు, ఆయన మనవడి చుట్టూ
నడిచే కథ. రెడ్డిగారు ఏ
రోజున పుట్టారో అదే రోజు మనవడు
కూడా పుడతాడు. 'దండంపెట్టి ఓటడిగేవాడు అన్నం పెడతానంటేనే ఓటెయ్'
అని జనానికి చెబుతుంటాడు హీరో. రాయలసీమ ఫ్యాక్షన్,
దాని ద్వారా వచ్చే అధికారం, దాన్ని
ఉపయోగించుకుని సంపాదించే డబ్బు... వీటి చుట్టూ అల్లిన
కథ. ఇందులో ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ ఉందని,
రెడ్డిగారికి ప్రత్యర్థి అయిన చౌదరి కూతురు,
హీరో ప్రేమించుకోవడం, వారి ప్రేమకూ, రాజకీయాలకూ
లంకె ఉండటం ఇందులోని ఇంటరెస్టింగ్
పాయింట్. రాజకీయం వ్యాపార స్థాయికి ఎలా ఎదిగిందో ఈ
కథలో చెబుతున్నా' అని ఆ మధ్య
వెల్లడించాడు.
ఇందులో
రెడ్డిగారి మనవడుగా ఎవరు నటిస్తున్నారు.. అసలు
కథాకమామిషు ఏమిటి అనేవిషయాలు త్వరలో
తెలుపుతానని, ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, డైరెక్టర్,
ఆర్టిస్టులు ఎవరు అనేది త్వరలోనే
వెల్లడిస్తానని ఈ మధ్య విడుదల
చేసిన ప్రకటనలో వెల్లడించారు.
ఆ విషయాలు పక్కన పెడితే...వచ్చే
ఉప ఎన్నికల ఫలితాల్ని బట్టి ఈ కథకు
క్లైమాక్స్ రాస్తా అని గతంలో చెప్పిన
జీవీ.....ఉప ఎన్నికలకు ముందు
తాను విడుదల చేసి ఈ చిత్రం
ఫస్ట్ లుక్ పోస్టర్‌పై
‘ఓటు వేస్తారా? చస్తారా' అనే ట్యాగ్ లైన్
ఇచ్చాడు, తాజాగా విడుదల చేసిన పోస్టర్‌పై
‘మీ బతుకులు నేనే మారుస్తా' అనే
ట్యాగ్ లైన్ తగిలించాడు. జీవీ
ఇలా ట్యాగ్ లైన్లు మార్చడం బట్టి చూస్తే జగన్
ఉప ఎన్నికల్లో గెలుపును బట్టి జీవీ కథ
తయారు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పైగా
జీవీ బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్. బాలయ్య
పొలిటికల్ కెరీర్ కి ఉపయోగ పడేలా
జగన్‌పై నెగెటివ్ గా
ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.
మరి ఇందులో వాస్తవం ఏంతో తేలాల్సి ఉంది.
0 comments:
Post a Comment