హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ
అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికల నేపథ్యంలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కాంగ్రెసు పార్టీ సహకరించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసుతో
జగన్ పార్టీ చీకటి ఒప్పందం చేసుకుందని
విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి,
జగన్కి మధ్య అంతర్గత
ఒప్పందం కుదిరిందన్నారు.
అందుకే
ఉప ఎన్నికల సమయంలో జగన్కు సానుభూతి
వచ్చేలా కిరణ్ పలు చర్యలు
తీసుకున్నారన్నారు. వైయస్ జగన్ చేసిన
ఆర్థిక నేరాలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఎలా వినియోగిస్తారని
ఆయన ప్రశ్నించారు. గతంలో పార్టీలు స్థాపించిన
వారు కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారని, ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
కూడా నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్ వద్ద పార్టీని కొన్నాడని,
అతను కూడా తన పార్టీని
మల్టీనేషనల్ పార్టీ కాంగ్రెసుకు తాకట్టు పెట్టడమో లేక ఆ పార్టీకి
అమ్మడమో చేస్తారని విమర్శించారు.
ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోసం కాంగ్రెసు నేతలు
పని చేశారన్నారు. జగన్ పార్టీకి సానుభూతి
రావడం కోసమే ఒకరోజు ముందు
జగన్ను దొంగలబండి ఎక్కించారన్నారు.
దానిని అతను రాద్దాంతం చేశాడన్నారు.
తెలుగుదేశం పార్టీ గెలిచే ప్రతి చోట కాంగ్రెసు
నేతలు జగన్ పార్టీ అభ్యర్థులకు
ఓటు వేయించారని మండిపడ్డారు. కాంగ్రెసుతో చీకటి ఒప్పందం పెట్టుకున్న
జగన్ పార్టీ నేతలు తమను విమర్శించడం
విడ్డూరమన్నారు.
ఇందిర
పేరుతో మీడియాను స్థాపించిన జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారన్నారు.
ప్రభుత్వం భారతి సిమెంట్స్కు,
సరస్వతి సిమెంట్స్కు కేటాయించిన గనులను
ఎందుకు రద్దు చేయడం లేదని
రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ పార్టీకి ఓటేస్తే
లాభం లేదని, అది కాంగ్రెసుకే లాభం
అన్నారు. జగన్ తన తండ్రి,
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
అవినీతిపరుడు అంటూ వ్యతిరేకించిన వారితోనే
కలిసి పని చేస్తున్నారన్నారు.
0 comments:
Post a Comment